ముస్లిం ఓట్ల కోసం బాబు నక్కజిత్తులు
ఊరు పేరు లేని నాయకులు, సంస్థలతో తమ మద్దతు బాబుకేనని చెప్పిస్తున్నారు. వారి ప్రచారంతో ఏపీలోని ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు.
ఎన్డీఏ కూటమిలో చేరడంతోటే చంద్రబాబుకి ముస్లిం ఓట్లపై నమ్మకం పోయింది. స్వతహాగా ఆయన ముస్లింలకు చేసిందేమీ లేకపోగా.. ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపీతో మళ్లీ చేతులు కలిపారు. దీంతో ఏపీలో ఆయనకు ముస్లిం ఓట్లు పడవని తేలిపోయింది. అయితే జిత్తులమారి చంద్రబాబు అంత తేలిగ్గా దేన్నీ వదిలిపెట్టరు కదా. ముస్లింలకు న్యాయం చేసింది తానేనంటూ కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. అంతే కాదు, ఊరు పేరు లేని నాయకులు, సంస్థలతో తమ మద్దతు బాబుకేనని చెప్పిస్తున్నారు. వారి ప్రచారంతో ఏపీలోని ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు.
సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రషీద్ షరీఫ్ ఈరోజు చంద్రబాబుని కలిశారు. తమ మద్దతు టీడీపీకేనని చెప్పారాయన. ఈ సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి అసలు గుర్తింపే లేదు. అపెక్స్ ముస్లిం బాడీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సదరు సంస్థను గుర్తించలేదు. గుర్తింపు లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆ సంస్థ.. ఏపీలో చంద్రబాబుతో చేతులు కలిపింది. అయితే ఇలాంటి సంస్థలేవీ ముస్లిం ఓట్లను కూటమివైపు మళ్లించలేవని తేలిపోయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దియోబంద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘కుల్ హింద్ తన్జీమ్ ముఫ్తియాన్’ సంస్థ కూడా చంద్రబాబుని కలిసి తమ మద్దతు తెలిపింది. కూటమికే ఓటు వేయాలని ఆ సంస్థ ప్రతినిధులు ఏపీలోని ముస్లిం ఓటర్లను కోరారు. ఇలాంటి సంస్థల్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
ఏపీలో ముస్లింలంతా జగన్ కి మద్దతివ్వాలంటూ ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. జగన్ మాత్రమే అసలు సిసలు లౌకిక వాది అని చెప్పారాయన. 4 శాతం రిజర్వేషన్లు ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలని, ఎన్డీఏకి అవకాశమిస్తే రిజర్వేషన్లు కష్టం అని తేల్చి చెప్పారు. దీంతో ఏపీలోని ముస్లిం ఓటర్లలో చాలామంది వైసీపీ స్టాండ్ తీసుకున్నారు. ఇటు చంద్రబాబు మాత్రం అడ్రస్ లేని సంస్థల ప్రతినిధులతో ఫొటోలు దిగుతూ.. ముస్లిం గ్రూపు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.