Telugu Global
Andhra Pradesh

ముగ్గురు పిల్లల్ని కనండి.. విజనరీ ప్రకటనపై పేలుతున్న జోకులు

చంద్రబాబు ముగ్గురు పిల్లల సిద్ధాంతంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తాజాగా కొడాలి నాని కూడా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ముగ్గురు పిల్లల్ని కనండి.. విజనరీ ప్రకటనపై పేలుతున్న జోకులు
X

ముగ్గురు పిల్లల్ని కంటే 'తల్లికి వందనం' పథకం ద్వారా ఆ ముగ్గురికి ఏడాదికి రూ45 వేలు తల్లుల ఖాతాలో జమ అవుతాయంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దేశంలో ప్రస్తుతం జనాభా తగ్గిపోతోందని, తన విజన్ తో ఈ మాట చెబుతున్నానని, ఏపీలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ముగ్గురు పిల్లల్ని కంటే వారు భవిష్యత్ తరానికి ఆస్తిగా ఉంటారన్నారు. పనిలో పనిగా 'తల్లికి వందనం' పథకం కింద ఎక్కువ లబ్ధి చేకూరుతుందంటూ చంద్రబాబు చెప్పారు.


విజనరీ ప్రకటనపై జోకులు..

చంద్రబాబు ముగ్గురు పిల్లల సిద్ధాంతంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఆయన ప్రసంగాన్ని వైసీపీ సానుభూతిపరులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. విజనరీ ఐడియా వినండి అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాన్ని ఫాలో కావాలని చెబుతున్నారా..? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. తాజాగా కొడాలి నాని కూడా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. "ముగ్గురిని కంటే రూ.45 వేలు ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. అదే రూ.45 వేలు ఇచ్చి వాళ్ల పప్పు­గా­డిని పిల్లలను కనమని చెప్పాలి. వాడినే ఐదారు­గురుని కనమని చెప్పాలి." అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సెల్ ఫోన్ కనిపెట్టా, కంప్యూటర్ ని ఇండియాకు తెప్పించానంటూ గతంలో వీరలెవల్లో కోతలు కోసి అభాసుపాలయ్యేవారు చంద్రబాబు. ఇప్పుడు మరింత ఆవేశంగా మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. చంద్రబాబు ప్రసంగాలను టీడీపీ నేతలే లైట్ తీసుకుంటున్నారు. వైసీపీ వాళ్లకు మాత్రం ఇవి మాంచి ట్రోలింగ్ సబ్జెక్ట్ లు గా పనికొస్తున్నాయి. ముగ్గురు పిల్లల సిద్ధాంతం మరికొన్నిరోజులపాటు ట్రెండింగ్ లో ఉండే అవకాశం ఉంది.

First Published:  9 Jan 2024 7:00 AM IST
Next Story