Telugu Global
Andhra Pradesh

అదో పెద్ద జోక్.. పవన్ కి మద్దతుగా బాబు ట్వీట్

"తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది." అంటూ పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేశారు చంద్రబాబు.

అదో పెద్ద జోక్.. పవన్ కల్యాణ్ కి మద్దతుగా చంద్రబాబు ట్వీట్
X

అదో పెద్ద జోక్.. పవన్ కల్యాణ్ కి మద్దతుగా చంద్రబాబు ట్వీట్

వాలంటీర్ల విషయంలో పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం పరువునష్టం కేసు పెట్టాలనుకోవడం నీతిమాలిన చర్య అంటూ మండిపడ్డారు చంద్రబాబు. పరువు గురించి ఈ ప్రభుత్వం మాట్లాడటం పెద్ద జోక్ అని అన్నారాయన. నాలుగేళ్లు దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయన్నారు. ప్రభుత్వానికి ధైర్యముంటే పవన్ కల్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

"తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది." అంటూ పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేశారు చంద్రబాబు. పవన్ పై కేసు పెట్టడం, బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారాయన. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు చేస్తున్నారని, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణచివేస్తున్నారని.. ఇది రాక్షస ప్రభుత్వ విధానం అని అన్నారు చంద్రబాబు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, అణచివేత ధోరణి మానుకోవాలని హితవు పలికారు.


వాస్తవానికి నిన్న సాయంత్రం పవన్ కల్యాణ్ కేసు వ్యవహారం బయటకొచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా నిన్న సాయంత్రమే విడుదలయ్యాయి. కానీ చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ట్వీట్ వేయడం విశేషం. వెంకటగిరి సభలో సీఎం జగన్.. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య.. ఇలా అందర్నీ ఒకేగాటన కట్టి దుమ్ముదులిపేశారు. వాలంటీర్లపై విమర్శలు చేసే అర్హత ఏ ఒక్కరికీ లేదంటూ.. ఒక్కొక్కరి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన కాసేపటికే చంద్రబాబు, పవన్ కి మద్దతుగా ట్వీట్ వేయడం విశేషం.

First Published:  21 July 2023 3:18 PM IST
Next Story