Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు మైండ్ గేమ్ షురూ.. 16మందికి ఆత్మ ప్రభోదం

సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈరోజు శాసన సభకు వచ్చారు.

చంద్రబాబు మైండ్ గేమ్ షురూ.. 16మందికి ఆత్మ ప్రభోదం
X

ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓట్లపైనే టీడీపీ ఆధారపడి ఉంది. వైసీపీలో ఉన్న ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వారిద్దరే కాదు.. మొత్తం వైసీపీలో 16మందికి ఆత్మ క్లారిటీ ఇస్తుందని వారంతా ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.

ఉదయం 9గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ అసెంబ్లీ హాల్ లో ప్రారంభమైంది. సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈరోజు శాసన సభకు వచ్చారు. అయితే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో తన మైండ్ గేమ్ మొదలు పెట్టారు. వైసీపీలో 16మంది అసంతృప్తితో ఉన్నారని, వారంతా టీడీపీ అభ్యర్థికే ఓటు వేస్తారంటూ ప్రచారం చేయిస్తున్నారు. నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ, జనసేన నుంచి ఫిరాయించినవారితో కలుపుకుంటే వైసీపీ అభ్యర్థుల గెలుపుకి ఢోకా లేదు. కానీ రెబల్స్ తోపాటు, మరికొందరు షాకిస్తే మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం కష్టం. సరిగ్గా ఇక్కడే టీడీపీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బలం లేకపోయినా పోటీలో అభ్యర్థిని బరిలో దింపింది. వైసీపీవైపు వెళ్లిన నలుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలపై టీడీపీకి ఆశలు లేవు కానీ, వైసీపీలో ఉన్న అసంతృప్తులపైనే టీడీపీ నమ్మకం పెట్టుకుంది. ఇద్దరు ఖాయంగా ఓటు వేస్తారంటున్నా, మరికొందరిలో అలజడి రేపేందుకు చంద్రబాబు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకే 16మంది ఉన్నారంటూ లీకులు వదులుతున్నారు. ఇంతకీ చంద్రబాబు అంచనా నిజమవుతుందా, లేక టీడీపీకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాకిస్తారా.. సాయంత్రానికి తేలిపోతుంది.

First Published:  23 March 2023 10:28 AM IST
Next Story