Telugu Global
Andhra Pradesh

తుపాను త‌గ్గ‌క‌ముందే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు

ప్రభుత్వం తరపున ఇన్నికార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు మాత్రం తుపానును అడ్డుపెట్టుకుని రాజకీయం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఫెయిలైందని, భోజనం కూడా పెట్టడంలేదని గోల చేస్తున్నారు.

తుపాను త‌గ్గ‌క‌ముందే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు
X

చంద్రబాబునాయుడు తన రాజకీయం కోసం చివరకు ప్రకృతిని కూడా వదలటంలేదు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వం ఫెయిలైందని గోల మొదలుపెట్టారు. బాధితులకు కనీసం భోజన పెట్టలేరా? పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయలేరా? అంటూ ఆరోపణలు గుప్పించారు. దాన్ని ఎల్లోమీడియా బాగా హైలైట్ చేస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగానే సహాయ చర్యలు మొదలుపెట్టింది. బాధితులకు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది.

ప్రతి గ్రామంలోని వలంటీర్లను రంగంలోకి దింపి అవకాశమున్న ప్రతి సాయాన్ని అందిస్తోంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సౌకర్యాలను అందిస్తోంది. గ్రామాల్లోని బాధితులందరినీ వలంటీర్లే చాలాచోట్ల పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. హుద్ హుద్, తిత్లీ తుపాను వచ్చినపుడు ప్రత్యేక జీవోలు విడుదల చేసి బాధితులను ఆదుకున్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ప్రత్యేక జీవోలు జారీచేసినంత మాత్రాన బాధితులకు సాయం అందినట్లు కాదు. రంగంలోకి దిగి బాధితులను ఆదుకుంటేనే సాయం చేసినట్లు అవుతుంది.

హుద్ హుద్ , తిత్లీ తుపాను సమయంలో సహాయ పనులకు చంద్రబాబే ఆడ్డుగా మారారని బాధితులే మండిపడ్డారు అప్పట్లో. సహాయ బృందాల్లో ఎవరి పనులను వాళ్ళను చేసుకోనీయకుండా ఆకస్మిక తనిఖీల పేరుతో చాలాసార్లు అంతరాయాలు కల్పించిన విషయం అందరికీ గుర్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అందుకు భిన్నంగా. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతూ.. వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు. తాను పీల్డులోకి వెళ్ళకుండానే బాధితులకు సాయం అందేట్లు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి మద్దతుగా ప్రతి ఊరిలోను వలంటీర్లు రంగంలోకి దిగారు.

ప్రభుత్వం తరపున ఇన్నికార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు మాత్రం తుపానును అడ్డుపెట్టుకుని రాజకీయం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఫెయిలైందని, భోజనం కూడా పెట్టడంలేదని గోల చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వచ్చిన తుపానులో ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వచ్చేస్తుందో అన్న టెన్షన్ తో చంద్రబాబు+ఎల్లోమీడియా కేవలం నెగిటివ్ యాంగిల్‌ను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోందో ఏం చేయటం లేదో బాధితులకు తెలియ‌కుండానే ఉంటుందా? ప్రభుత్వం ఫెయిలైందని చెప్పాల్సింది బాధితులే కానీ చంద్రబాబు కాదు కదా.

First Published:  6 Dec 2023 10:55 AM IST
Next Story