నమ్మండి ప్లీజ్.. జనసేన జెండా ఊపుతున్న బాబు
‘రా.. కదలిరా’ సభల్లో పదే పదే జనసేనను హైలైట్ చేస్తున్నారు. శ్రీకాకుళం సభలో టీడీపీ, జనసేన జెండా ఊపి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.
సీట్ల విషయంలో జనసేనకు చంద్రబాబు కుర్చీ మడతపెట్టేశారనే విషయం అందరికీ తెలిసిందే. 24సీట్లు విదిల్చిన బాబు, జనసైనికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. వారిని కూల్ చేయడానికి ఇప్పుడు తంటాలు పడుతున్నారు. టీడీపీ అభ్యర్థులు నిలబడిన చోట జనసేన ఓటు ట్రాన్స్ ఫర్ కావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు బాబు. ‘రా.. కదలిరా’ సభల్లో పదే పదే జనసేనను హైలైట్ చేస్తున్నారు. శ్రీకాకుళం సభలో టీడీపీ, జనసేన జెండా ఊపి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.
ఈనాడు వార్తలు.. చంద్రబాబు ప్రసంగాలు..
ఏపీలో ఎన్నికల వేళ ఎల్లో మీడియా పూర్తిగా బరితెగించిందనే విషయం అందరికీ అర్థమైపోయింది. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ రోజూ పదులకొద్దీ ఆర్టికల్స్ పడుతున్నాయి. వైసీపీ ఇన్ చార్జ్ లు గా ప్రకటించిన నేతల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అలా వచ్చిన ఈనాడు వార్తల సారాంశాన్ని ఈరోజు స్టేజ్ పై చదివి వినిపించారు చంద్రబాబు. ఈనాడు హెడ్డింగులని యథాతథంగా ఆయన చదవడం విశేషం. అంటే ఇదంతా ఓ పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా జరుగుతుందని అర్థమవుతోంది.
రుణం తీర్చుకుంటా..
ఇప్పటి వరకు చేసింది చాలదని, మరోసారి అవకాశం ఇవ్వాలంటున్న చంద్రబాబు, ఈసారి అధికారంలోకి వస్తే పేద ప్రజల రుణం తీర్చుకుంటానని శ్రీకాకుళం సభలో చెప్పారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ అధిక సంపద ఉన్న రాష్ట్రంగా మారేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారని, ఆ పార్టీ నేతలు మాత్రం ధనవంతులయ్యారని చెప్పారు. 45రోజులపాటు కష్టపడాలని, టీడీపీ-జనసేన కూటమిని అధికారంలోకి తేవాలని హితబోధ చేశారు చంద్రబాబు.