Telugu Global
Andhra Pradesh

మౌనమేల చంద్రబాబూ.. బీజేపీ దిమ్మతిరిగే షరతుల వల్లేనా..

బీజేపీ, జనసేనలకు 50 సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేవి 125 సీట్లు మాత్రమే. సొంతంగా మెజారిటీ సాధించాలంటే టీడీపీ 90 సీట్ల దాకా గెలుచుకోవాల్సి ఉంటుంది.

మౌనమేల చంద్రబాబూ.. బీజేపీ దిమ్మతిరిగే షరతుల వల్లేనా..
X

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమైన తర్వాత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడా బీజేపీతో పొత్తు గురించి మాట్లాడలేదు. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు నోరు విప్పకపోవడానికి అసలు కారణమేమిటో తెలిసిపోయింది. చంద్రబాబు ముందు బీజేపీ నాయకులు దిమ్మతిరిగే షరతులు పెట్టారని సమాచారం. చంద్రబాబుకు మింగుడు పడని విధంగా పొత్తు విషయంలో బీజేపీ ప్లాన్‌ చేసినట్లు చెప్పుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కూటమి గెలిస్తే టీడీపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగ‌ర్ రాకుండా చూడాలనే వ్యూహంతో బీజేపీ అగ్ర నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. తమకూ, జనసేనకు కలిపి 50 సీట్లు ఇవ్వాలని వారు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఈనెల 13వ తేదీలోగా ఆ విషయం తేల్చాలని డెడ్‌లైన్‌ పెట్టినట్లు చెప్పుతున్నారు.

బీజేపీ, జనసేనలకు 50 సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేవి 125 సీట్లు మాత్రమే. సొంతంగా మెజారిటీ సాధించాలంటే టీడీపీ 90 సీట్ల దాకా గెలుచుకోవాల్సి ఉంటుంది. 125 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లు సాధించడం సాధ్యమవుతుందా అనే సందేహం చంద్రబాబును పీడిస్తోంది. ఈ స్థితిలో కక్కలేక మింగలేక చంద్రబాబు సతమతవుతున్నట్లు తెలుస్తోంది.

First Published:  12 Feb 2024 2:44 PM IST
Next Story