జగన్ శ్రీలంక చేస్తాడు సరే, నువ్వేం చేస్తావ్ చంద్రబాబూ?
ఆ మొత్తాన్ని చంద్రబాబు ఎలా సేకరించుకుంటారనేది ప్రశ్న. జగన్ సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారని విమర్శించిన చంద్రబాబు తాను ఏ విధంగా వాటిని అమలు చేస్తారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈనాడు రామోజీరావు దానికి వంత పాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం మొత్తం 52 వేల 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఒక వేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయడం కుదరుదు. వాటిని రద్దు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. అందువల్ల ఆ మొత్తాన్ని చంద్రబాబు కూడా భరించాల్సిందే. పైగా, పింఛన్లవంటి వాటిని పెంచుతానని ఆయన చెప్పారు.
చంద్రబాబు తాజాగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ఏడాదికి 73,440 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అయ్యే వ్యయాన్ని చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ఖర్చయ్యే వ్యయాన్ని కలిపితే మొత్తం 1.4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఆ మొత్తాన్ని చంద్రబాబు ఎలా సేకరించుకుంటారనేది ప్రశ్న. జగన్ సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారని విమర్శించిన చంద్రబాబు తాను ఏ విధంగా వాటిని అమలు చేస్తారు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనే ప్రశ్నలకు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. జగన్ శ్రీలంక చేస్తాడు సరే, చంద్రబాబు ఏం చేస్తాడు? అందువల్ల నిధుల సమీకరణపై ఆయన స్పష్టంగా సమాధానం చెప్పి ఓట్లు అడగాల్సి ఉంటుంది.