నన్ను ఒకవైపే చూశారు.. రెండోవైపు చూపిస్తా
రాష్ట్రానికి నీళ్లు అడిగితే.. తన రక్తంతో రాష్ట్రాన్ని తడిపేందుకు అధికార వైసీపీ సిద్ధమైందని, అందుకే తనపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రజలు, టీడీపీ సానుభూతిపరుల రక్తం కళ్లజూస్తున్నారని అన్నారు.
రాజకీయాల్లో ఇప్పటి వరకు తన మంచితనాన్నే చూశారని, ఇక రాజకీయ దుర్మార్గులపై అణచివేతను చూపిస్తానంటూ హెచ్చరించారు చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా పర్యటనలు చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో ఒకేరోజు సుడిగాలి పర్యటన చేసిన చంద్రబాబు.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
రాష్ట్రానికి నీళ్లు అడిగితే.. తన రక్తంతో రాష్ట్రాన్ని తడిపేందుకు అధికార వైసీపీ సిద్ధమైందని, అందుకే తనపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రజలు, టీడీపీ సానుభూతిపరుల రక్తం కళ్లజూస్తున్నారని అన్నారు. భయపడి ఊరుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, రాష్ట్రం మీద బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిలో తిరుగుబాటు రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి సముద్రంలో కలిపేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
సీఎం జగన్ కు ఎక్స్ పైరీ డేట్ దగ్గరపడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఆరు నెలల్లో ఆయన ఇంటికెళ్లిపోతారన్నారు. రౌడీ రాజకీయాలు చేసే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తాను జనంలో తిరిగితే వారిలో చైతన్యం వస్తోందని వైసీపీ భయపడిందని, అందుకే తనను అడుగుడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఇప్పుడు జనమే తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కి మూడు గేట్లు పెట్టలేని జగన్, మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. నెలరోజుల్లోపే గేట్లు పెడతానని చెప్పిన మంత్రి రాంబాబు, వాటిని గాలికొదిలేసి బ్రో సినిమా లెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.