Telugu Global
Andhra Pradesh

ఉంపుడు గత్తెలు, బానిసలు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

పోలీసులతో బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. సంక్రాంతి తర్వాత తన పోరాటం మరింత గా స్పీడ్ గా ఉంటుందన్నారు.

ఉంపుడు గత్తెలు, బానిసలు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
X

చంద్రబాబు

రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు.. ఉంపుడుగత్తెల్లా మారిపోయారని, బానిసల్లా మారిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. సంక్రాంతి సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లిన బాబు.. మీడియాతో కాసేపు ముచ్చటించారు. వైసీపీ నాయకులు ఏమి రాయమంటే మీడియా అది రాస్తోందని, బానిస బతుకులా తయారైందని అన్నారు.

ఈ సంక్రాంతి భవిష్యత్తు మీద భరోసా కోసం పోరాడే శక్తినిస్తుందని చెప్పారు చంద్రబాబు. తన లెక్క ప్రకారం వైసీపీ నాయకులంతా అర్హత లేని వ్యక్తులేని అన్నారు. ప్రజాస్వామ్యంలో సేవా భావంతో పని చేసే వ్యవస్థ రాజకీయం అని, వైసీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారని విమర్శించారు. తప్పులు చేస్తూ, ఆ తప్పుల్ని పోలీసుల ద్వారా కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులతో బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. సంక్రాంతి తర్వాత తన పోరాటం మరింత గా స్పీడ్ గా ఉంటుందన్నారు.

పవన్ ని చూసి అంత భయమెందుకు..?

పవన్ కల్యాణ్ సభ పెట్టి తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని, అంతమాత్రాన వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు పవన్ కల్యాణ్‌. పవన్ ని ఎందుకు తిడుతున్నారు? ఎందుకంత భయం? ఎందుకంత పిరికితనం? అని ఎద్దేవా చేశారు.. అధికారం ఉందన్న అహంకారం మంచికాదని, ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలు తెగించి రోడ్డుపైకి వస్తున్నారని తెలిపారు. ఏపీలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టకూడదంటున్నారని, కానీ వైసీపీ మాత్రం పెట్టుకోవచ్చా..? అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన పోరాటం ఆగదని, రాష్ట్రాన్ని కాపాడుకుంటానని ప్రకటించారు చంద్రబాబు.

First Published:  13 Jan 2023 5:43 PM IST
Next Story