Telugu Global
Andhra Pradesh

బెడ్ రూమ్ లో దూరి ఆమెను అరెస్ట్ చేస్తారా..? చంద్రబాబు ధ్వజం

కల్యాణిని ఓ ఉగ్రవాదిలాగా ట్రీట్ చేస్తూ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఆమె అరెస్ట్ ని ఖండిస్తూ ట్వీట్ వేశారు.

బెడ్ రూమ్ లో దూరి ఆమెను అరెస్ట్ చేస్తారా..? చంద్రబాబు ధ్వజం
X

తెలుగు మహిళ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్న కల్యాణి ముందస్తు బెయిల్ రాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల ఆమె హనుమాన్ జంక్షన్ లోని తన నివాసంలో ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే ఆమె అప్పటికి నైట్ డ్రస్ లో ఉన్నారు. కనీసం డ్రస్ మార్చుకోడానికి అవకాశం ఇవ్వాలన్నా మహిళా పోలీసులు ససేమిరా అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మహిళా నేతను అరెస్ట్ చేయడం సరికాదని, బెడ్ రూమ్ లోకి దూరి మరీ ఆమెను వేధించడం దారుణం అని ధ్వజమెత్తారు.


అరెస్ట్ ఎందుకు..?

కృష్ణా జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవపై ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నాయి. వైసీపీ వారు పెట్టిన కేసులో నిందితురాలిగా కల్యాణి పేరు ఉంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయాలనుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు. బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల ఆమె హనుమాన్ జంక్షన్ లోని తన ఇంటిలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే మహిళా కానిస్టేబుల్స్ ని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. కనీసం డ్రస్ మార్చుకుని వస్తానన్నా కూడా పోలీసులు వినలేదని కల్యాణి ఆరోపిస్తున్నారు.

ఆమె ఉగ్రవాదా..?

కల్యాణిని ఓ ఉగ్రవాదిలాగా ట్రీట్ చేస్తూ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఆమె అరెస్ట్ ని ఖండిస్తూ ట్వీట్ వేశారు. ఆమెపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆమె బెడ్ రూంలోకి చొరబడ్డారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కల్యాణిని ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం అన్నారు చంద్రబాబు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అన్నారు చంద్రబాబు.

First Published:  10 April 2023 5:22 AM GMT
Next Story