చంద్రబాబు ప్రెస్‌మీట్ రద్దు.. ఎందుకంటే?
అటు బీజేపీ, ఇటు ఇండియా కూటమి మేజిక్ ఫిగర్‌కు సమాన దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఏపీలో 16 సీట్లు సాధించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు.
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించింది. అయితే ఫలితాల తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయగా, చివరి నిమిషంలో ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్నారు. ఎందుకంటే.. అటు బీజేపీ, ఇటు ఇండియా కూటమి మేజిక్ ఫిగర్‌కు సమాన దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఏపీలో 16 సీట్లు సాధించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు.
ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతున్నప్పటికీ.. ఇండియా కూటమి నేతలు సైతం చంద్రబాబును సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 సీట్లు అవసరం. అటు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌తోనూ ఇండియా కూటమి నేతలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఏర్పడిన పరిస్థితితో ఆయా కూటముల ముందు ఉంచాల్సిన డిమాండ్లపై పార్టీ నేతలతో చర్చించి, నిర్ణయం తీసుకున్నాక చంద్రబాబు రేపు మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.