మరోసారి పవన్ కల్యాణ్‌ను బకరా చేసిన చంద్రబాబు
పవన్ కల్యాణ్ పాత్ర రాష్ట్రంలో లేకుండా మరో ఎత్తు వేశారు. ఆయన్ను లోక్‌సభకు పోటీ చేయిస్తున్నారు. కేంద్రంలో ఆయనకు మంత్రి పదవి ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పుతున్నారు.
జనసేన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను మరోసారి బకరా చేశారు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు తెగ కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని ఆశించారు. అందుకు అవకాశం లేకుండా చంద్రబాబు ఎత్తులు వేశారు. కేవలం 24 సీట్లను జనసేనకు కేటాయించి పనవ్ కల్యాణ్‌ను దెబ్బ తీశారు. కాపు సామాజికవర్గానికి చెందిన చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి నేతలను పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు దూరం చేశారు. దాంతో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా గొంతెత్తేవారు లేకుండా చేశారు. తన మార్కు రాజకీయ చదరంగంలో పవన్ కల్యాణ్‌ను కార్నర్ చేశారు.
తాజాగా, పవన్ కల్యాణ్ పాత్ర రాష్ట్రంలో లేకుండా మరో ఎత్తు వేశారు. ఆయన్ను లోక్‌సభకు పోటీ చేయిస్తున్నారు. కేంద్రంలో ఆయనకు మంత్రి పదవి ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పుతున్నారు. కాకినాడ నుంచి పవన్ కల్యాణ్ చేత లోక్‌సభకు పోటీ చేయించాలని ప్లాన్ చేశారు. కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి కావడానికి ఏ విధమైన అడ్డంకులూ ఉండవు. అందుకు చంద్రబాబు సహకారం కూడా అవసరం లేదు.
ఒకవేళ చచ్చీచెడి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బిజెపి కూటమి గెలిస్తే పవన్ కల్యాణ్ కేంద్రానికి వెళ్లిపోతారు. తద్వారా తనకు ముఖ్యమంత్రి పదవి కావాలనే డిమాండ్ పవన్ కల్యాణ్ నుంచి వచ్చే అవకాశం లేదు. మెల్లగా తన తనయుడు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవు. నారా లోకేష్‌కు దారి సుగమం చేయడానికి పవన్ కల్యాణ్ పోటీలో ఉండకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తండ్రి నందమూరి హరికృష్ణను దెబ్బ తీసినట్లుగానే ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను నారా లోకేష్ కోసం దెబ్బ తీస్తున్నారు. ఇంతా చేస్తే జగన్‌ను గద్దె దించి తాను ముఖ్యమంత్రి పదవిని చేపడుతాననే నమ్మకం చంద్రబాబుకు కూడా ఉన్నట్లు లేదు. తాను ఆడే చదరంగంలో తానే చిత్తయ్యే ఎత్తులను చంద్రబాబు వేస్తున్నారు.