Telugu Global
Andhra Pradesh

పవన్‌కు చంద్రబాబు ఫోన్

టీడీపీ- జనసేన మరింత దగ్గరవుతున్నాయి

పవన్‌కు చంద్రబాబు ఫోన్
X

టీడీపీ- జనసేన మరింత దగ్గరవుతున్నాయిటీడీపీ- జనసేన మరింత దగ్గరవుతున్నాయి. విశాఖ పర్యటనలో జనసేన కార్యకర్తలు దాడులకు దిగడంతో పోలీసులు పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. విశాఖ పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఈనేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. జనసేన అధినేతకు చంద్రబాబు తన సంఘీభావం తెలిపారు.

విశాఖ పోలీసుల నుంచి తనకు ఎదురవుతున్న ప్రతిఘటనను చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్ వివరించారు. పవన్ కల్యాణ్‌కు సంఘీభావం తెలిపిన చంద్రబాబునాయుడు.. జనసేన కార్యకర్తలపై కేసుల నమోదును ఖండించారు. ఈ విషయంలో జనసేనకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను ధూషించడమే పనిగా ప్రభుత్వం పనిచేస్తోందని పవన్‌ కల్యాణ్‌ వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడిగా ప్రజాసమస్యలను తెలుసుకునే హక్కు మీకుందని పవన్‌తో టీడీపీ అధినేత చెప్పారు.

First Published:  16 Oct 2022 6:49 PM IST
Next Story