అందరూ కలిసి చంద్రబాబును ముంచారా?
గుడివాడ మీటింగ్‌కు చంద్రబాబు వస్తున్నారంటే లోకల్ నేతలు జనాలను ఏ స్థాయిలో సమీకరిస్తారో అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే సభ అట్టర్ ఫ్లాపయ్యింది. విచిత్రం ఏమిటంటే జనాలు లేకపోయినా చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోకుండా దాదాపు గంటకు పైగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.
గుడివాడలో అడుగుపెడితే ఏమవుతుందో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అందుకనే ఇంతకాలం నేతలు ఎంతడిగినా నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు. తీరా తప్పని పరిస్థితుల్లో అడుగుపెడితే అవమాన పడక తప్పలేదు. నేతలంతా కలిసి తమ అధినేతను ముంచేశారు. చంద్రబాబుకు గుడివాడలో మామూలు అవమానం ఎదురుకాలేదు. ఇదేం ఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు గుడివాడకు వచ్చారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద బహిరంగసభ కూడా జరిగింది. భారీ బహిరంగసభ అయితే జరిగింది కానీ అక్కడ జనాలే లేరు.
చంద్రబాబు వస్తున్నారంటే జనాలు తండోపతండాలుగా వచ్చేస్తారని తమ్ముళ్ళు అనుకున్నట్లున్నారు. అందుకనే ఎవరు కూడా జనసమీకరణ చేయలేదు. ఫలితంగా పెద్ద సంఖ్యలో కుర్చీలు కనబడ్డాయి కానీ వాటిల్లో జనాలే లేరు. అంతపెద్ద బహిరంగసభకు ఏర్పాట్లు చేసి వేలాది కుర్చీలను వేసినవాళ్ళు జనసమీకరణ చేయకపోతే ఎలా? చంద్రబాబు సభకు మూడు, నాలుగు వందల మంది హాజరయ్యుంటే అదే ఎక్కువ. టికెట్ కోసం పోటీలు పడుతున్న నేతలు జనసమీకరణను మాత్రం పట్టించుకోలేదు.
గుడివాడ మీటింగుకు చంద్రబాబు వస్తున్నారంటే లోకల్ నేతలు జనాలను ఏ స్థాయిలో సమీకరిస్తారో అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే సభ అట్టర్ ఫ్లాపయ్యింది. విచిత్రం ఏమిటంటే వేదిక మీద నుండి మాట్లాడిన చంద్రబాబుకు ఎదురుగా జనాలు లేరన్న విషయం తెలుసు. బహిరంగసభ నిర్వహించినప్పుడు ఎదురుగా జనాలు లేకపోతే మాట్లాడేందుకు ఎవరికి కూడా ఇష్టముండదు. కానీ చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోకుండా దాదాపు గంటకు పైగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. వేదిక మీద కూర్చున్న నేతలకు కూడా చంద్రబాబు ప్రసంగానికి విసుగొచ్చేసింది.
గుడివాడలో కొడాలిని ధీటుగా ఎదుర్కోనేంత సీన్ తమ్ముళ్ళల్లో ఎవరికీ లేదని దీంతోనే అర్థమైపోయింది. నేతలు తలా వెయ్యి మందిని సమీకరించినా కనీసం ఐదారువేల మంది జనాలు కనబడేవారు. టికెట్ కోసం పోటీపడుతున్న రావి వెంకటేశ్వరరావు, వెనిగంట్ల రాము, నియోజకవర్గ ఇన్చార్జి కొనకండ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులంతా వేదిక మీద కనిపించారు. వీరిలో ఒక్కళ్ళకి కూడా జనసమీకరణ సాధ్యం కాలేదా? ఇంకా విచిత్రం ఏమిటంటే చంద్రబాబు ప్రసంగాన్ని టీడీపీ ట్విట్టర్లో 9 నిమిషాల 15 సెకన్ల బిట్ అప్ లోడ్ చేశారు. అయితే ఇందులో పది సెకన్లు కూడా సభలో జనాలను చూపలేదంటేనే తెలిసిపోతోంది సభ ఎంత పేలవంగా జరిగిందో. గుడివాడలో ఇలాంటిది జరుగుతుందనే ఇంతకాలం చంద్రబాబు అడుగుపెట్టలేదా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.