పవన్‌తో చంద్రబాబు భేటీ... ఇకపై తెరపైనే స్నేహం
విశాఖ పర్యటనలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో పవన్‌కు సంఘీభావం తెలిపే పేరుతో చంద్రబాబు.. పవన్ ఉన్నహోటల్‌కు వెళ్లారు. చాలా సేపు చర్చించుకున్నారు. చర్చల్లో నాగబాబు, నాదెండ్ల కూడా పాల్గొన్నారు.
వైసీపీ చెప్పినట్టుగానే జరుగుతోంది. జనసేన-టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయి. బీజేపీతో తాను ఉన్నప్పటికీ పార్టీతో కలిసి పోరాటం చేసేందుకు తనకు మనసు రావడం లేదని పవన్ చెప్పిన కాసేపటికే చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కలిశారు.
విశాఖ పర్యటనలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో పవన్‌కు సంఘీభావం తెలిపే పేరుతో చంద్రబాబు.. పవన్ ఉన్నహోటల్‌కు వెళ్లారు. చాలా సేపు చర్చించుకున్నారు. చర్చల్లో నాగబాబు, నాదెండ్ల కూడా పాల్గొన్నారు. పవన్‌ను కలిసేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా పవన్ ఉన్నహోటల్‌కు వెళ్లగా నాగబాబు, నాదెండ్ల స్వాగతం పలికారు.
ఇకపై ఉమ్మడి పోరాటం చేయాలన్న ప్రతిపాదనపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయి. నేటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతుందని.. బీజేపీకి తాను ఊడిగం చేయాల్సిన పని లేదని.. పవన్ కల్యాణ్ చెప్పిన వెంటనే చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీని గద్దె దించేందుకు ఏ పార్టీతోనైనా కలుస్తానన్న స్లోగన్‌తో మరోసారి టీడీపీతో జనసేన కలిసిపోవడం ఇక లాంచనమే.