Telugu Global
Andhra Pradesh

సీనియర్ల శకం ముగిసినట్లేనా?

వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ తరపున ఎవరు పోటీ చేయాలో మీరే డిసైడ్ చేసుకోమని చంద్రబాబు ఆయా నేతలకే ఛాయిస్ ఇచ్చేశారు. దాంతో చేసేదేమీలేక వారసులనే పోటీ చేయించటానికి సీనియర్లు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కారణంగా పార్టీలోని చాలామంది సీనియర్ల పాత్ర దాదాపు ముగిసిందనే అనుకోవాలి.

సీనియర్ల శకం ముగిసినట్లేనా?
X

తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్న సీనియర్ నేతల్లో చాలామంది తెరమరుగైపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలి ప్యాక్‌ల‌ రూపంలో తమతో పాటు వారసులకు కూడా టికెట్లు తీసుకోవాలని సీనియర్లు అనుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలు చాలా కీలకమైన కారణంగా అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు నాయుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నో ఫ్యామిలి ప్యాక్ అని స్పష్టంగా చెప్పేశారు.

వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ తరపున ఎవరు పోటీ చేయాలో మీరే డిసైడ్ చేసుకోమని చంద్రబాబు ఆయా నేతలకే ఛాయిస్ ఇచ్చేశారు. దాంతో చేసేదేమీలేక వారసులనే పోటీ చేయించటానికి సీనియర్లు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కారణంగా పార్టీలోని చాలామంది సీనియర్ల పాత్ర దాదాపు ముగిసిందనే అనుకోవాలి. ఇపుడున్న సీనియర్లలో అత్యధికులు 1982లో యువకులుగా ఉన్నపుడు చేరినవాళ్ళే. కాబట్టి సహజంగానే సీనియర్లలో చాలా మంది వయసు 70 దాటిపోయింది.

యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, చింతకాయల అయ్యన్నపాత్రుడు, జేసీ బ్రదర్స్, కేఈ ఫ్యామిలీ, రాయపాటి సాంబశివరావు, అశోక్ గజపతిరాజు, కేఎస్ జవహర్, కేశినేని నాని, కళా వెంకటరావు, జలీల్ ఖాన్ లాంటి మరికొందరు ఫ్యామిలి ప్యాక్‌లు అడుగుతున్నారు. చంద్రబాబు గనుక తన నిర్ణయంపై గట్టిగా కూర్చుంటే పై నేతల వారసులు మాత్రమే పోటీలో ఉంటారు. పరిటాల సునీత, జవహర్ వయసు రీత్యా సీనియర్లు కాకపోయినా కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చేది లేదని చెప్పేశారు. పోయిన ఎన్నికల్లోనే సునీతను కాదని కొడుకు శ్రీరామ్ పోటీచేసిన విషయం తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతోనే సీనియర్ల వారసులు పార్టీతో పాటు నియోజకవర్గాల్లో చాలా బిజీగా తిరిగేస్తున్నారు. కాబట్టి సీనియర్లలో అత్యధికులు వారసులకు మార్గదర్శకులుగా మాత్రమే మిగిలిపోవటం ఖాయం. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వారసులను ముందుపెట్టి సీనియర్లు వెనక నుంచి చక్రం తిప్పుతారు. అదే ఓడిపోతే మాత్రం చేసేదీమీ ఉండదు.

First Published:  12 Oct 2022 6:10 AM GMT
Next Story