రాజకీయాల నుంచి తప్పుకుంటా - చంద్రబాబు
ఈ వీడియోను ఇప్పుడు వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. జగనన్న దెబ్బకు హడలిపోయి చంద్రబాబు రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారని ట్వీట్ చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామితో చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ చేశారు.
ప్రజలు మన్నన పొందడంలో ఫెయిల్ అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటలకు కట్టుబడి ఉంటారా.. లేదా.. కేవలం సానుభూతి కోసం ఈ కామెంట్స్ చేశారా..? అన్న అర్ణబ్ ప్రశ్నకు సమాధానంగా సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఆ విషయంలో తాను చాలా క్లియర్‌గా ఉన్నానని చెప్పారు. ప్రజలు ఆమోదిస్తే తానేందుకు బాధపడాలన్నారు. తాను రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. ఒకవేళ ప్రజలు వైసీపీదే న్యాయమని నమ్మితే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
జగనన్న దెబ్బకి హడలిపోయి రాజకీయాలకి చంద్రబాబు గుడ్ బై..
— YSR Congress Party (@YSRCParty) February 1, 2024
గత ఎన్నికల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీని 23 సీట్లకే పరిమితం చేసి మూలన కూర్చోబెట్టిన సీఎం వైయస్ జగన్.. రానున్న ఎన్నికల్లో @JaiTDP మరింత చిత్తుగా ఓడిపోతుందని ఇప్పటికే తేల్చేసిన సర్వేలు.
కుప్పంలోనూ బాబు ఓడిపోయే పరిస్థితి. దాంతో… pic.twitter.com/AM7fyONFM2
ఈ వీడియోను ఇప్పుడు వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. జగనన్న దెబ్బకు హడలిపోయి చంద్రబాబు రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారని ట్వీట్ చేసింది. గత ఎన్నికల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని 23 సీట్లకే పరిమితం చేసి వైఎస్ జగన్ మూలన కూర్చొబెట్టారని.. రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయని స్పష్టంచేసింది. కుప్పంలోనూ ఓడిపోయే పరిస్థితి ఉండడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వైసీపీ ట్వీట్ చేసింది.