ఆ దాడిని మేం ఖండించాం.. ఈ దాడిని జగన్ ఖండించలేదేం..!
పవన్ పై విసిరారంటున్న రాయి కనపడింది కానీ పవన్ కి గాయం కాలేదు కదా..? మరి దాన్ని దాడి అని ఎలా అనగలరు.? ఇలాంటి చెత్త లాజిక్ లతో మరోసారి పరువు పోగొట్టుకున్నారు చంద్రబాబు.
చంద్రబాబు తన తెలివితేటలన్నీ రంగరించి ఓ భయంకరమైన లాజిక్ వెదికిపట్టారు. జగన్ పై రాయితో దాడి జరిగితే ఆ ఘటనను తామంతా ఖండించామని, అలాంటి దాడి పవన్ పై జరిగితే మీరెవరూ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. జగన్ పై దాడి ఘటనలో రాయి కనపడలేదని, పవన్ పై దాడి ఘటనలో రాయి ప్రత్యక్ష సాక్షిగా కళ్లముందే ఉందని అన్నారు. పెడన సభలో చంద్రబాబు ఈ ప్రశ్నలు సంధించగా, సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
గులకరాయి డ్రామా ఆర్టిస్ట్ జగన్ రెడ్డి, రాయి ఎక్కడ ?#PrajaGalamForDemocracy #PrajaGalam #VarahiVijayaBheri#TDPJSPBJPWinning #KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/8GOF5nqoee
— Telugu Desam Party (@JaiTDP) April 17, 2024
డ్రామాలు ఎవరివి బాబూ..!
గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇప్పుడు రాళ్లదాడి కూడా నాటకం అని, జగన్ ని గాయం చేసిన రాయి కనపడకపోవడమే దానికి ఉదాహరణ అంటున్నారు. రాయి కనపడకపోతే పోయింది, జగన్ పై జరిగిన దాడికి గాయమే ప్రత్యక్ష సాక్ష్యం అనేది చంద్రబాబుకి తెలియదా..? రోడ్ షో జరుగుతున్నప్పుడే జగన్ కి గాయం కావడం, ఆ గాయం నుంచి రక్తం కారడం, వైద్యులు ప్రథమ చికిత్స చేయడం, ఆ తర్వాత జగన్ కి ప్రభుత్వ ఆస్పత్రిలో కుట్లు వేయడం అన్నీ కళ్లముందున్న నిజాలు. వీటిని చంద్రబాబు ఎలా కాదంటారు. ఈ విషయంలో డ్రామాలు ఎవరివి..? జగన్ వా..? బాబువా..?
పవన్ పై దాడి జరిగిందా..?
పవన్ కల్యాణ్ పై కూడా సభలో ఉన్నప్పుడు రాళ్లదాడి జరిగిందని, దాన్ని వైసీపీ నేతలు ఎందుకు ఖండించలేదని లాజిక్ తీశారు చంద్రబాబు. ఇక్కడే బాబు పప్పులో కాలేశారు. జగన్ పై దాడి జరిగితే మోదీ కూడా స్పందించారు, నిజమే.. మరి పవన్ పై దాడి జరిగితే మోదీ కనీసం స్పందించారా..? అంటే పవన్ పై జరిగింది దాడి కాదనే విషయం కూటమి నేతలందరికీ తెలుసు. అందుకే ఎవరూ స్పందించలేదు. పవన్ పై విసిరారంటున్న రాయి కనపడింది కానీ పవన్ కి గాయం కాలేదు కదా..? మరి దాన్ని దాడి అని ఎలా అనగలరు.? ఇలాంటి చెత్త లాజిక్ లతో మరోసారి పరువు పోగొట్టుకున్నారు చంద్రబాబు. తన పరువు తీసుకోవడంతోపాటు, పవన్ పరువు కూడా తీసిపారేశారు.