Telugu Global
Andhra Pradesh

అమరావతి వెలవెలబోయిన పుణ్యం చంద్రబాబుదే కదా..?

ఏపీకి సరైన రాజధాని లేదంటే అందుకు మొదటి కారకుడు చంద్రబాబు మాత్రమే. తప్పులన్నీ తనలో పెట్టుకుని జగన్ పైన బురదచల్లేయటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది.

అమరావతి వెలవెలబోయిన పుణ్యం చంద్రబాబుదే కదా..?
X

తిరువూరు బహిరంగసభలో చంద్రబాబు ఒక మాటన్నారు. అదేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కిపోయిందట. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలపోతోందని చంద్రబాబు తెగ బాధపడిపోయారు. అసలు 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి.. ఇంకా రాజధాని స్టేటస్సే రాని అమరావతికి పోలికపెట్టడమే తప్పు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2016లో అమరావతిని రాజధానిగా ఏకపక్షంగా ప్రకటించారు. రాజధానిగా ప్రకటించారు కాని శాశ్వతంగా ఒక్క నిర్మాణం కూడా చేయలేదు.

తన పాలనంతా అమరావతి గ్రాఫిక్స్‌లతో జనాలను మోసం చేయటంతోనే గడిపేశారు. కనీసం ఒక్క మంచి రోడ్డు కూడా వేయలేకపోయారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు పేరుతో నాసిరకం నిర్మాణాలు చేశారంతే. పైమూడు నాసిరకం నిర్మాణాలకు సుమారు రూ.1100 కోట్లు ఖర్చుచేశారు. అందుకనే రాజధాని పేరుతో చంద్రబాబు వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. అమరావతి పేరుతో జరిపిన భూసమీకరణలో కూడా వేలాది ఎకరాల భూదోపిడీ జరిగిందని సీఐడీ కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

అమరావతి వెలవెలపోతోందంటే అందుకు చంద్రబాబే కారణం. వాస్తవ పరిస్థితులను మరచిపోయి, భ్రమల్లో బతికేసి ఆకాశానికి నిచ్చెన్నలు వేసి అమరావతిని గ్రాఫిక్స్ కు మాత్రమే పరిమితంచేసిన విజనరీ చంద్రబాబు. 2019లో టీడీపీ ఘోరఓటమి తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిపాదించగానే అమరావతి అటకెక్కేసింది. తన హయాంలో భ్రమల్లో తేలకుండా తానే రాజధాని పేరుతో అవసరమైన శాశ్వత భవనాలు కట్టేసుంటే మూడు రాజధానులను ప్రతిపాదించే అవకాశం జగన్ కు ఉండేది కాదేమో.

ఏపీకి సరైన రాజధాని లేదంటే అందుకు మొదటి కారకుడు చంద్రబాబు మాత్రమే. తప్పులన్నీ తనలో పెట్టుకుని జగన్ పైన బురదచల్లేయటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది. అసలు హైదరాబాద్ తో అమరావతిని పోల్చటమే చంద్రబాబు తప్పు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అమరావతిలో ప్రపంచ రాజధాని కడతానని, ప్రపంచలో ఏ దేశానికి లేనంత అద్భుతమైన రాజధాని కడతానని తాను భ్రమల్లో మునిగి జనాలందరినీ భ్రమల్లో ముంచి చివరకు ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచింది చంద్రబాబే. ఇప్పుడు అమరావతి వెలవెలబోతోందని అనుకుంటే ఏమిటి ఉపయోగం..?

First Published:  8 Jan 2024 10:51 AM IST
Next Story