Telugu Global
Andhra Pradesh

నంద్యాలలో గొడవపై చంద్రబాబు సీరియస్.. విచారణకి కమిటీ

వాస్తవానికి గతంలోనే భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. కానీ.. వాళ్లు చంద్రబాబు మాటని పెడచెవిన పెట్టి గత కొంతకాలంగా మళ్లీ ఘర్షణకి దిగుతున్నారు. దాంతో ఇదే లాస్ట్ వార్నింగ్ అని చంద్రబాబు హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.

నంద్యాలలో గొడవపై చంద్రబాబు సీరియస్.. విచారణకి కమిటీ
X

నంద్యాలలో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన గొడవపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి నంద్యాల జిల్లాలోకి నారా లోకేష్ ప్రవేశించారు. ఈ క్రమంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గీయులు అతని స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన భూమా అఖిల ప్రియ వర్గం రక్తం వచ్చేలా కొట్టారు. దాంతో అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అఖిల ప్రియతో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నంద్యాలలో టీడీపీ నేతల మధ్య గొడవపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీలోని సీనియర్ నేతలతో ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. గొడవపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పార్టీలో క్రమశిక్షణ తప్పేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలోనే భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. కానీ.. వాళ్లు చంద్రబాబు మాటని పెడచెవిన పెట్టి గత కొంతకాలంగా మళ్లీ ఘర్షణకి దిగుతున్నారు. దాంతో ఇదే లాస్ట్ వార్నింగ్ అని చంద్రబాబు హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.

నారా లోకేష్ పాదయాత్ర 100 రోజులు దాటింది. దాంతో టీడీపీలోనూ కొత్త జోష్ వచ్చింది. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ తాను వెళ్తున్న ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాడు. కానీ నంద్యాలలో తాజా గొడవ వైసీపీ అస్త్రంగా మారిపోయింది. ఇదే చంద్రబాబుకి మరింత కోపం తెప్పిస్తోంది.

First Published:  17 May 2023 2:02 PM IST
Next Story