నందమూరి.. మళ్ళీ బకరాయేనా?
వచ్చే ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీని మూడు నియోకవర్గాల్లో పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ మూడు నియోజకవర్గాలు ఏవంటే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం.
రాబోయే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల నుంచి నందమూరి వారసులు పోటీ చేస్తారన్న ప్రచారం బాగా వినిపిస్తోంది. పైగా ఆ మూడు చోట్ల తెలుగుదేశంపార్టీ నేతలు దాదాపు చేతులెత్తేశారు. అందుకనే నందమూరి ఫ్యామిలీతో పై మూడు నియోకవర్గాల్లో ఒకటి, రెండు చోట్ల పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ ఈ మూడు నియోజకవర్గాలు ఏవంటే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం.
చిలకలూరిపేట మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టున్న నియోజకవర్గం. మొదటిసారి వైసీపీ తరపున ఒక బీసీ మహిళ విడదల రజని పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించటం సంచలనంగా చెప్పుకున్నారు. మళ్ళీ ఇక్కడ టీడీపీ గెలవాలంటే నందమూరి వారసులు పోటీ చేయించాలని పార్టీ నేతలు చంద్రబాబుపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ప్రత్తిపాటిపై పార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. నందమూరి కుటుంబంలోని సుహాసిని పేరును చాలామంది తెరమీదకు తెచ్చారు.
ఇక గుడివాడ, గన్నవరంలో కూడా టీడీపీకి గట్టి అభ్యర్థులు దొరకటంలేదు. ఉండటానికి తమ్ముళ్ళు చాలామందే ఉన్నా వైసీపీ తరపున పోటీ చేయబోయే కొడాలి నాని, వల్లభనేని వంశీలను ధీటుగా ఎదుర్కొనే సీన్ ఉన్న తమ్ముళ్ళు లేరట. అందుకనే ఈ రెండు నియోజకవర్గాల్లో కనీసం ఒకచోట అయినా నందమూరి కుటుంబ సభ్యులను దింపితే ఎలాగుంటుందనే ఆలోచన చంద్రబాబులో మొదలైందనే ప్రచారం పెరిగిపోతోంది. ఆ మధ్య నందమూరి తారక్ పేరు వినబడింది కానీ ఇప్పుడు అతను లేడు. అయితే అతని ప్లేస్‌లో నందమూరి చైతన్య కృష్ణ పేరు వినబడుతోంది. గుడివాడలో పోటీకి చైతన్యరామ్ రెడీ అని చెప్పారట.
మరి గన్నవరంలో ఏమిచేస్తారో తెలీదు. చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా సుహాసిని పోటీ విషయంలో సానుకూలంగానే ఉన్నారట. మొత్తానికి పై మూడు నియోజకవర్గాల్లో పోటీ విషయంలో నందమూరి ఫ్యామిలీ పేర్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే నందమూరి కుటుంబం మళ్ళీ బకరా అయిపోతుందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. సుహాసిని కూకట్‌పల్లిలో ఇప్పటికే ఒకసారి ఓడిపోయారు. తాజాగా గుడివాడ, గన్నవరంలో చంద్రబాబు పర్యటన ఫ్లాప్ అయ్యింది. ఇంతమంది తమ్ముళ్ళుండి అధినేత పర్యటన ఫెయిలయ్యిందంటే పార్టీ సత్తా ఏమిటో తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం పోటీ చేస్తే ఏమవుతుంది అనే సందేహాలు పెరిగిపోతోంది.