చంద్రబాబే మొదలుపెట్టొచ్చు కదా..!
`పూర్ టు రిచ్` అని, పేదల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలని చాలాకాలంగా చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. మాటలు చెబుతున్నారే కానీ తాను మాత్రం ఆచరణలో చూపించటంలేదు. ఇతరులకు చెప్పేముందు తాను ఆచరించి చూపిస్తే అది మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తుంది.
కొంతకాలంగా చంద్రబాబునాయుడు ఒకమాట చెబుతున్నారు. అదేమిటంటే `పూర్ టు రిచ్` అని. పేదలను ధనవంతులుగా చేయటమే తన లక్ష్యమని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎంతమంది పేదలను ధనవంతులుగా చేశారో చెప్పమంటే మాట్లాడరు. ప్రపంచాన్ని మార్చేయటానికి చంద్రబాబు చెప్పే మాటలన్నీ ప్రతిపక్షంలో ఉన్నపుడే వినిపిస్తారు. అధికారంలోకి రాగానే అంతకుముందు చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. ఈ విషయం చాలాసార్లు అందరూ ప్రత్యక్షంగా చూసిందే. ఇప్పుడు కొత్తగా చెబుతున్న మాటేమిటంటే పేదలను ధనికులను చేయటమట.
అందుకని పన్నులు చెల్లిస్తున్న ప్రతి ధనవంతులు చేయాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ 5 లేదా 10 పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలట. వారి పిల్లలకు మంచి విద్యను అందించి, నైపుణ్యాభివృద్ధికి సాయం చేయాలట. అప్పుడే పేద పిల్లలు అభివృద్ధిలోకి వస్తారట. అంతాబాగానే ఉంది మరి ఇదే పని చంద్రబాబు ఎందుకు చేయకూడదు? తాను చెబుతున్న ఆదర్శాలను మాటల వరకే కాకుండా ఆచరణలో కూడా చూపించవచ్చు కదా. అప్పుడు కదా చంద్రబాబు ధనవంతుల సమాజానికి మార్గదర్శిగా నిలవగలరు.
తనతో పాటు పార్టీలో కొన్నివందల మంది కోటీశ్వరులున్నారు. 10 పేద కుటుంబాలను దత్తత తీసుకోమని ఇతరులకు చెప్పే బదులు ముందు ఆ పనేదో తనతోనే తన పార్టీ నేతలతోనే మొదలుపెట్టవచ్చు. చెప్పేమాటల్లో నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు, తమ్ముళ్ళు తీసుకునే దత్తత వల్ల కొన్ని వేల పేద కుటుంబాలు ధనవంతులుగా మారిపోతారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వేలాది మంది పేద కుటుంబాల్లోని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి ధనవంతులైపోతారు.
`పూర్ టు రిచ్` అని, పేదల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలని చాలాకాలంగా చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. మాటలు చెబుతున్నారే కానీ తాను మాత్రం ఆచరణలో చూపించటంలేదు. ఇతరులకు చెప్పేముందు తాను ఆచరించి చూపిస్తే అది మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చంద్రబాబును అనుసరించే అవకాశముంది. కాబట్టి వేదికల మీద అనవసరమైన మాటలు చెప్పే బదులు ముందు తాను ఆచరించటం మొదలుపెడితే సమాజానికి పాజిటివ్ సంకేతాలు పంపినట్లవుతుంది. మరి చంద్రబాబు ఎప్పుడు దత్తత కార్యక్రమం మొదలుపెడతారో .