టీడీపీ అనవసరంగా ఆయాసపడుతోందా?
వివేకా హత్యకు జగన్‌కు లింకు పెట్టేసి లబ్దిపొందాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవు. కాబట్టి ఈ విషయంలో టీడీపీ ప్రయత్నాలన్నీ వృథా అనే అనిపిస్తోంది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయినవాళ్ళకి కూడా జగన్‌తో ముడిపెట్టేసి గోలగోల చేస్తోంది టీడీపీ.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు నాయుడు తాపత్రయం. అందులో తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే అధికారంలోకి రావాలన్న ఆతృతలో చంద్రబాబు ఎంచుకుంటున్న దారే విచిత్రంగా ఉంది. ప్రజలకు ఏమాత్రం పట్టని అంశాలపై టీడీపీ అనవసరంగా సమయాన్ని వృథా చేస్తోందని అనిపిస్తోంది. ప్రజలకు కనెక్టయ్యే అంశాలను వదిలేసి జనాలు ఏమాత్రం ఆసక్తిచూపని విషయాలపై టీడీపీ అనవసరంగా ఆయాసపడుతోంది. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద హత్య కేసు కూడా ఇందులో ఒకటి.
నిజానికి వివేకా హత్య కేసును లాగటం వల్ల టీడీపీకి ఎలాంటి లాభముండదు. ఎందుకంటే వివేకా అనే వ్యక్తి కేవలం కడప జిల్లాకు మాత్రమే పరిమితమైన వ్యక్తి. అదికూడా అన్న వైఎస్సార్ నీడలోనే రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. సొంతంగా వివేకాకు ఎలాంటి అస్తిత్వం లేదు. వైఎస్సార్ బతికున్నంతకాలం ఆయన తమ్ముడిగా ఆయన పోయిన తర్వాత జగన్ బాబాయ్‌గా మాత్రమే వివేకాకు గుర్తింపుండేది. అలాంటి వ్యక్తి హత్యను అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చంద్రబాబు ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు.
వివేకా హత్యకు జగన్‌కు లింకు పెట్టేసి లబ్దిపొందాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవు. కాబట్టి ఈ విషయంలో టీడీపీ ప్రయత్నాలన్నీ వృథా అనే అనిపిస్తోంది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయినవాళ్ళకి కూడా జగన్‌తో ముడిపెట్టేసి గోలగోల చేస్తోంది టీడీపీ. లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అరెస్టుతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారని, వణికిపోతున్నారని ఎల్లో మీడియా రాసేస్తోంది.
పైగా లిక్కర్ స్కామ్ దేశంలో సంచలనంగా మారిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనమైంది లిక్కర్ స్కామ్ కాదు హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూపు పరిణామాలే. లిక్కర్ స్కామ్‌లో అరెస్టులతో జగన్ ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతారు? వాళ్ళేమన్నా వైసీపీ ఎంపీలా? మంత్రులా? అసలు ఈ రోజుల్లో అరెస్టవటాన్ని ఎవరైనా అవమానంగా భావిస్తున్నారా? జనాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వదిలేసి ప్రజలకు డైరెక్టుగా సంబంధంలేని అంశాలపై గోల చేయటం ద్వారా టీడీపీ అనవసరంగా ఆయసపడుతున్నట్లుంది.