Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఎంపీలొస్తే టికెట్లిచ్చేద్దాం.. ఆత్రంగా ఎదురుచూస్తున్న చంద్ర‌బాబు

బీజేపీకి, జ‌న‌సేన‌కు క‌లిపి ఇచ్చిన 8 సీట్లు పోనూ మిగిలిన 17 సీట్ల‌లో ఏడెనిమిది టీడీపీ లీడ‌ర్ల‌కు ఇస్తున్నారంటే మిగిలిన 10 మంది వైసీపీ వ‌ల‌స ప‌క్షుల‌కే ఇచ్చేయాల‌ని బాబుగారు బ‌లంగా ఫిక్స‌యిపోయారు.

వైసీపీ ఎంపీలొస్తే టికెట్లిచ్చేద్దాం.. ఆత్రంగా ఎదురుచూస్తున్న చంద్ర‌బాబు
X

40 ఇయ‌ర్స్‌ ఇండ‌స్ట్రీ బాబుగారు త‌మ పార్టీకి 25 స్థానాల్లో ఎంపీ అభ్య‌ర్థుల‌ను త‌యారుచేసుకోలేక‌పోయారా..? వైసీపీ మీద అలిగి, ఎవ‌రొస్తారో పార్టీ కండువా క‌ప్పేద్దామ‌ని వేచి చూస్తున్నారా? అలా వ‌చ్చిన‌వారికే ఎంపీ సీట్లు అప్ప‌గించేద్దామ‌ని ఆత్రంగా ఉన్నారా? అంటే వీట‌న్నింటికీ ఒక్క‌టే స‌మాధానం.. అవును.. అవును.. అవును. ఒంగోలు, నెల్లూరు, న‌ర‌స‌రావుపేట‌, క‌ర్నూలు ఇలా ఈ జాబితా చాంతాడులా పెరిగిపోతున్నా చంద్ర‌బాబు మాత్రం ఇంకా రానీ.. రానీ అంటున్నారు.

న‌ర‌స‌రావుపేట నుంచి క‌ర్నూలు వ‌ర‌కు

వాస్తవంగా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారిలో ఏడెనిమిది మందికి మాత్ర‌మే టీడీపీ టికెట్లివ్వ‌బోతోంది. బీజేపీకి, జ‌న‌సేన‌కు క‌లిపి ఇచ్చిన 8 సీట్లు పోనూ మిగిలిన 17 సీట్ల‌లో ఏడెనిమిది టీడీపీ లీడ‌ర్ల‌కు ఇస్తున్నారంటే మిగిలిన 10 మంది వైసీపీ వ‌ల‌స ప‌క్షుల‌కే ఇచ్చేయాల‌ని బాబుగారు బ‌లంగా ఫిక్స‌యిపోయారు. అందుకే న‌ర‌స‌రావుపేట నుంచి క‌ర్నూలు వ‌ర‌కు ఇప్ప‌టికే వారికే టికెట్లు కేటాయించింది.

అంతా వాళ్లేనా?

న‌ర‌స‌రావుపేటలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయుల‌కే టికెట్ ఇస్తోంది. ఒంగోలులో టికెట్ ద‌క్క‌క పార్టీ జంప్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి టీడీపీ ఒంగోలు ఎంపీ సీటు ఖాయ‌మైంది. నెల్లూరులో వైసీపీ నుంచి వ‌చ్చిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఖాయం చేసింది. వైసీపీకి రాజీనామా చేసిన క‌ర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌కు అక్క‌డే టీడీపీ టికెట్ ఇస్తోంది. ఇంకా చాలా మంది వ‌స్తార‌ని, వారికి టికెట్లు ఇద్దామ‌ని బాబు ఆలోచ‌న‌.

First Published:  15 March 2024 7:41 AM GMT
Next Story