పవన్ను అడ్డంపెట్టి టికెట్లు ఎగ్గొడుతున్నారా..?
గతంలో తనను దూషించి, విమర్శించిన వారికి టికెట్లిస్తే జనసేన పనిచేయదని, కాపుల ఓట్లు బదిలీకావని పవన్ తనతో చెప్పినట్లు చంద్రబాబే పార్టీలో ప్రచారం చేయిస్తున్నారట.
రాబోయే ఎన్నికల్లో చాలామంది సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు టికెట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఆ విషయాన్ని డైరెక్టుగా వాళ్ళకి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారట. అందుకని మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అడ్డంపెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ను బూచీగా చూపించి తాను ఎవరికైతే టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్నారో వాళ్ళకంతా చంద్రబాబు ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంటే పార్టీలో సీనియర్ తమ్ముళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నట్లు అర్థమైపోతోంది.
ఇప్పుడు విషయం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతకాయల విజయ్ లాంటి కొందరికి టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అదే విషయాన్ని డైరెక్టుగా వాళ్ళతోనే చెప్పేయచ్చు. కానీ, చంద్రబాబుకు అంత ధైర్యంలేదు. అందుకనే పవన్ను అడ్డంపెట్టుకుని సీనియర్ తమ్ముళ్ళకి టికెట్లను ఎగ్గొడుతున్నారట. ఎలాగంటే గతంలో పవన్ పైన కొందరు సీనియర్లు బాగా నోరుపారేసుకున్నారు. అలాంటి వాళ్ళల్లో పైన చెప్పిన ముగ్గురితో పాటు మరికొందరున్నారు.
గతంలో తనను దూషించి, విమర్శించిన వారికి టికెట్లిస్తే జనసేన పనిచేయదని, కాపుల ఓట్లు బదిలీకావని పవన్ తనతో చెప్పినట్లు చంద్రబాబే పార్టీలో ప్రచారం చేయిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో గెలుపు కీలకం కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన చెప్పినట్లు సర్దుకుపోక తప్పదని చంద్రబాబు సీనియర్లతో అంటున్నారట. జనసేన మనస్ఫూర్తిగా పనిచేయాలన్నా.. కాపుల ఓట్లు బదిలీ కావాలన్నా, కొన్నిసీట్లలో పవన్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని పదేపదే చెబుతున్నారట. నిజానికి టీడీపీలో చంద్రబాబు ఎవరికి టికెట్లిస్తారన్న విషయంతో పవన్ కు ఎలాంటి సంబంధంలేదు.
వైరి పక్షాలుగా ఉన్నప్పుడు రెండుపార్టీల నేతలు వందనుకున్నారు. ఆమాటకొస్తే చంద్రబాబు, లోకేష్ పైన పవన్ వంద ఆరోపణలు చేశారు. వాళ్ళిద్దరినీ బహిరంగసభల్లోనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. టీడీపీ అంతమే తన పంతమన్నారు. అలాంటిది ఇప్పుడు అదే చంద్రబాబుతో పవన్ పొత్తుపెట్టుకోలేదా..? కాబట్టి చంద్రబాబు కావాలని అనుకుంటే ఒకలాగ, వద్దనుకుంటే మరోలాగ వ్యవహరిస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాను టికెట్లు ఇవ్వకూడదని అనుకున్న వాళ్ళకి పవన్ను బూచిగా చూపించి ఎగ్గొడుతున్నారట.