Telugu Global
Andhra Pradesh

'చంద్రబాబు, నేను వైసీపీ అరాచ‌కాలపై మాట్లాడుకున్నాం' పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు పర్యటించకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పించడం దుర్మార్గమన్నారు. తన పర్యట‌నలను కూడా ఇలాగే అడ్డుకున్నారని, అన్ని పక్షాలు కలిసి వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

చంద్రబాబు, నేను వైసీపీ అరాచ‌కాలపై మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్
X

అధికార వైసీపీ చేస్తున్న అరాచకాలపై చంద్రబాబు, తాను మాట్లాడుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఇద్దరు నేతలు దాదాపు రెండు గంటల‌ పాటు సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు పర్యటించకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పించడం దుర్మార్గమన్నారు. తన పర్యట‌నలను కూడా ఇలాగే అడ్డుకున్నారని, అన్ని పక్షాలు కలిసి వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంపై బీజేపీతో కూడా మాట్లాడుతానని చెప్పారు పవన్.

తెలుగు దేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ జీఓ నెంబర్ 1 ను రద్దుచేసే దాకా పోరాడుతామన్నారు. జగన్ మాత్రమే సభలు పెట్టుకోవాలి కానీ ఇతర పార్టీలు మాత్రం సమావేశాలు ఏర్పాటు చేయకూడదనే కుట్ర తోనే ఆ జీవో తెచ్చారని అన్నారు. ఆ జీవోకి అసలు చట్టబద్దతే లేదని బాబు అన్నారు. కందుకూరు, గుంటురు మరణాల సంఘటనల్లో కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు.

తననే కాకుండా గతంలో వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ను కూడా అడ్డగించారని, ఇప్పటంలో పవన్ కు మద్దతిచ్చినందుకు ప్రజల ఇళ్ళను కూల‌గొట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ చంద్రబాబు. తమ ముందు ఉన్న ప్రధాన సమస్య ప్రస్తుతం అసలు రాజకీయ పార్టీల కార్యకలాపాలు సాగేట్టు చూడడం ఎలా అనేదే అని, అందువల్ల తాము ముందు అంద‌రం కలిసి జీవో నెంబర్ 1 ను రద్దు చేయించడం, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టవేయడం అని అన్నారు బాబు. ఆ తర్వాత పొత్తుల గురించి ఆలోచిస్తామని చంద్రబాబు తెలిపారు.

First Published:  8 Jan 2023 9:28 AM GMT
Next Story