తోడల్లుడి కొడుకు కోసం చీరాల సీటు రిజర్వ్ చేసిన బాబు
తోడల్లుడు కోరిక మేరకు చీరాల టిడిపి సీటుని బాబు రిజర్వ్ చేసి పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే చీరాల ఇన్చార్జిగా ఎవరినీ నియమించడంలేదని టాక్.
ప్రతిపక్ష నేత చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీచేసి ఓడిపోయిన దగ్గుబాటి అప్పటి నుంచి వైసీపీతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. భార్య పురందేశ్వరి బీజేపీలో అగ్రనాయకురాలిగా కొనసాగుతోంది. భార్య ఉన్న పార్టీతోనూ దగ్గుబాటికి సంబంధాలు లేవు. అయితే అనూహ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు టిడిపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. అదీ తన తనయుడు రాజకీయ భవిత్యం కోసం చంద్రబాబుతో చర్చలు సాగించారని సమాచారం.
తోడల్లుడు కోరిక మేరకు చీరాల టిడిపి సీటుని బాబు రిజర్వ్ చేసి పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే చీరాల ఇన్చార్జిగా ఎవరినీ నియమించడంలేదని టాక్. టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి కరణం బలరాం జంప్ కొట్టిన నుంచీ చీరాల నియోజకవర్గం తెలుగుదేశానికి ఇన్చార్జి లేరు. ఏదో ఒక పేరు టిడిపి ప్రకటించినా అది నామమాత్రపు నియామకమే. చీరాలలో మొదటి నుంచీ తెలుగుదేశానికి బలమైన ఇన్చార్జి లేరు. వచ్చినవారెవరకూ పార్టీలో మరో ఎన్నికల వరకూ కొనసాగకపోవడంతో పార్టీ కూడా చీరాలని పెద్దగా పట్టించుకోవడంలేదని కేడర్ అసంతృప్తిగా ఉన్నారు.
కాపు సామాజికవర్గానికి చెందిన యడం బాలాజీకి ఇన్చార్జి ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గారు. యాదవ కులానికి చెందిన కొండయ్య పేరు ఇన్చార్జిగా ప్రకటించారు. ఈ నియామకమూ తాత్కాలికమేనని తెలుస్తోంది. చీరాల అసెంబ్లీ టిడిపి టికెట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడికి కేటాయించనున్నారని ప్రచారం సాగుతోంది. తోడల్లుడు కొడుకు ఇక్కడి నుంచి బరిలోకి దిగితే, ఏ ఇబ్బందులు లేకుండా మరో ముఖ్యనాయకుడు టిడిపిలో పోటీలో లేకుండా నియోజకవర్గంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.