ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయింపు.. హోం మంత్రిగా ఎవరంటే?
గతంలో పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన పయ్యావులకు ఆర్థిక శాఖతో పాటు శాసనసభా వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. ఎవరకీ కేటాయించని శాఖలతో పాటు GAD, లా అండ్ ఆర్డర్ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు మంత్రులకు పొర్ట్‌ఫోలియోలు కేటాయించారు చంద్రబాబు. ఊహించినట్లుగానే జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్‌కు ఐటీతో పాటు మానవవనరుల శాఖను అప్పగించారు. గతంలో పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన పయ్యావులకు ఆర్థిక శాఖతో పాటు శాసనసభా వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. ఎవరకీ కేటాయించని శాఖలతో పాటు GAD, లా అండ్ ఆర్డర్ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు చంద్రబాబు.
మంత్రులకు కేటాయించిన శాఖలు -
నారా చంద్రబాబు నాయుడు - GAD, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, ఇతరులకు కేటాయించని శాఖలు
పవన్‌కల్యాణ్ - పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
నారా లోకేష్ - మానవ వనరుల శాఖ, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్
కింజరపు అచ్చెన్నాయుడు - వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్
కొల్లు రవీంద్ర - ఎక్సైజ్, గనులు
నాదెండ్ల మనోహర్ - పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు
పొంగూరు నారాయణ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్
అనిత వంగలపూడి - హోం శాఖ, విపత్తుల నిర్వహణ
సత్యకుమార్ - వైద్యారోగ్య శాఖ, వైద్య విద్య
నిమ్మల రామానాయుడు - వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్
ఆనం రామనారాయణ రెడ్డి -దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ - ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్ - రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు
కొలుసు పార్థసారథి- హౌసింగ్, సమాచార, ప్రసారాల శాఖ
డోలా బాల వీరాంజనేయులు - సోషల్ వెల్ఫేర్, సచివాలయం, విలేజ్ వాలంటీర్లు
గొట్టిపాటి రవికుమార్ - విద్యుత్
కందుల దుర్గేష్ - టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫి
గుమ్మడి సంధ్యారాణి - మహిళా, శిశు సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్
బి.సి.జనార్ధన్ రెడ్డి - రోడ్లు,భవనాల శాఖ
టి.జి.భరత్ - పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్
S.సవిత - బీసీ వెల్ఫేర్, ఆర్థిక వెనుకబడిన వర్గాలు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్
వాసంశెట్టి సుభాష్ - కార్మిక శాఖ
కొండపల్లి శ్రీనివాస్ - MSME, సెర్ప్
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి - రవాణా శాఖ, యువజన, క్రీడా విభాగం