చంద్రబాబుకు తనకూ వైరం ఉండేది..దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు
దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు, దగ్గుబాటిలు ఒకే వేదికపై కనిపించారు.

దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు వచ్చారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు దగ్గుబాటిని అభినందిస్తూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు, దగ్గుబాటిలు ఒకే వేదికపై కనిపించారు.. కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలుస్తున్నారు. కానీ ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
మాజీ మంత్రి దగ్గుబాటి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తనకూ వైరం ఉందని మాట నిజమే అన్నారు. కానీ ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాలానికి అనుగుణంగా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలని పేర్కొన్నారు.తాను ఈ పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ బుక్ కోసం ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని.. ఎంబీబీఎస్ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ స్టడీస్‌పై పరిజ్ఞానం తనకు అంతగా లేదన్నారు. అసలు చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలో ఆలోచించానని పేర్కొన్నారు.తాను ఈ పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
ఈ బుక్ కోసం ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని.. ఎంబీబీఎస్ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ స్టడీస్‌పై పరిజ్ఞానం తనకు అంతగా లేదన్నారు. అసలు చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలో ఆలోచించానని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి వెంకయ్యనాయుడు అని కొనియాడారు. తాను, వెంకయ్యనాయుడు ఇద్దరం 1978లో ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి ప్రవేశించామన్నారు. వెంకయ్యనాయుడు నిర్మోహమాటంగా అభిప్రాయాలను తెలియజేస్తారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో పరందేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు.ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికూడా పాల్గొనున్నారు.