ఊహించిందే.. ఆ ముగ్గురు IASలపై బాబు వేటు!
పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, జల వనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్‌లను నియమించింది. సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్నకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబు సర్కార్ ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. దాదాపు 19 మంది IASలకు స్థానం చలనం కల్పించింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్‌లకు షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. వై.శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్‌లను.. సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇక కీలకమైన CRDA కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను నియమించింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, జల వనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్‌లను నియమించింది. సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్నకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
- జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - జి.సాయి ప్రసాద్
- కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - గోపాలకృష్ణ ద్వివేదీ
- సీఎం కార్యదర్శి - ప్రద్యుమ్న
- ఐటీ, RTGS కార్యదర్శి - కోన శశిధర్ (అదనపు బాధ్యతలు)
- సీఆర్‌డీఏ కమిషనర్ - కాటమనేని భాస్కర్
- సివిల్ సప్లైస్ కమిషనర్ - సిద్ధార్థ్ జైన్
- వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - రాజశేఖర్
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి - సౌరభ్‌గౌర్
- నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి - సౌరభ్‌గౌర్ (అదనపు బాధ్యతలు)
- ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శి - బాబు
- పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి - శశిభూషణ్ కుమార్
- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - అనిల్ కుమార్ సింఘాల్
- పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి - కోన శశిధర్