Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి బెయిల్..

అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన కోర్టు ఈరోజు బెయిలిస్తూ తీర్పునిచ్చింది.

Chandrababu Naidu Bail: చంద్రబాబుకి బెయిల్
X

చంద్రబాబుకి బెయిల్..

స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన కోర్టు ఈరోజు బెయిలిస్తూ తీర్పునిచ్చింది.

యుద్ధం మొదలైంది..

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు నేపథ్యంలో ముందుగానే నారా లోకేష్, బ్రాహ్మణి రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్నారు. వారు అక్కడికి వచ్చాక బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చింది. చంద్రబాబుకి బెయిల్ రావడంపై లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధం ఇప్పుడే మొదలైందని నారా లోకేష్ కార్యకర్తలతో అన్నారు.

టీడీపీ నేతల సంబరాలు..

స్కిల్ స్కామ్ లో చంద్రబాబు గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లపై రోజూ కోర్టుల్లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎట్టకేలకు అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాలుస్తూ తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనపై మిగతా కేసుల్లో కూడా విచారణ జరుగుతోంది. తాజాగా ఆయనపై లిక్కర్ స్కామ్ లో కూడా కేసు నమోదైంది.

First Published:  31 Oct 2023 10:30 AM IST
Next Story