జగన్‌కు చంద్రబాబు బంపరాఫర్
తాను అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో ఎప్పుడూ రైతులకు నష్టపరిహారం అదించని చంద్రబాబు కూడా ఇప్పుడు జగన్‌కు వార్నింగులిచ్చేస్తున్నారు. పైగా జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తే ఇద్దరం కలిసి రైతులను ఆదుకుందామని బంపరాఫర్ ఇవ్వటమే చాలా విచిత్రంగా ఉంది.
తన సహజ స్వభావానికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు యాక్షన్ చాలా ఓవర్‌గా ఉందని అర్థమైపోతుంది. రాజమండ్రిలో పర్యటించిన సందర్భంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక వార్నింగ్, జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్, తనను చూసి ప్రభుత్వం భయపడిపోతోందని ఒక సర్టిఫికెట్ తనకు తానే ఇచ్చేసుకున్నారు. ఇక్కడే చంద్రబాబు ఓవరాక్షన్ బయటపడింది. ఇంతకీ వార్నింగ్ ఏమిటంటే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే 9వ తేదీ నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారట.
జగన్‌కు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటంటే రైతుల సమస్యలు తెలుసుకోవటానికి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అందరం కలిసి రైతులకు అండగా ఉందామన్నారు. అప్పటికి రైతులంటే చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడారు. ధాన్యం కొనుగోళ్ళల్లో అధికారులకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటంలో చంద్రబాబు అందించబోయే సహకారం ఏమిటో అర్థకావటంలేదు. ధాన్యాన్ని అమ్మేది రైతులు, కొనేది ప్రభుత్వం అయితే మధ్యలో చంద్రబాబు సహకారం ఏమిటి?
తాను క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టగానే ఆగమేఘాలపైన ధాన్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. అంటే తనంటే ప్రభుత్వం భయపడుతోందని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. 72 గంటల్లో ధాన్యం కొనకపోతే పోరుబాటు తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వర్షాలు పడుతున్నపుడు నష్టాల అంచనా వేయటం సాధ్యంకాదు. వర్షాలు తగ్గిపోయిన తర్వాత అంచనాలు వేయటం మొదలవుతుంది. అధికారంలో ఎవరున్నా జరిగేదిదే. కాకపోతే తొందరలో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తున్నారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో ఎప్పుడూ రైతులకు నష్టపరిహారం అదించని చంద్రబాబు కూడా ఇప్పుడు జగన్‌కు వార్నింగులిచ్చేస్తున్నారు. పైగా జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తే ఇద్దరం కలిసి రైతులను ఆదుకుందామని బంపరాఫర్ ఇవ్వటమే చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ఇలాంటి ఓవరాక్షన్లు ఇంకా ఎన్ని చూడాలో.