Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారా?

చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే 12 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంటు నియోజకవర్గాలట. ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమని తమ్ముళ్ళు తెగ పోరుతున్నారు.

చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారా?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు బంపరాఫర్ ఇచ్చారా? అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ మధ్య చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రెండు సార్లు భేటీ అయ్యారు. అంటే ప్రత్యేకమైన భేటీ కాకపోయినా ఎన్టీయార్ జ్ఞాపకార్థం విడుదలైన 100 రూపాయల కాయిన్ కార్యక్రమంలో అవకాశం దొరికినపుడు మాట్లాడారు. ఆ సందర్భంగానే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు పెద్ద ఆఫర్ ఇచ్చారని సమాచారం.

ఇంతకీ చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే 12 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంటు నియోజకవర్గాలట. ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమని తమ్ముళ్ళు తెగ పోరుతున్నారు. బీజేపీతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పదేపదే చెబుతున్నారు. బీజేపీతో పెట్టుకుంటే జరగబోయే నష్టం ఏమిటో చంద్రబాబుకు కూడా తెలుసు. అయితే బీజేపీని దూరం చేసుకుంటే ఎదురవ్వబోయే సమస్యలు కూడా చంద్రబాబు అనుభవంలోకి వచ్చింది. అందుకనే బీజేపీతో దూరంగా ఉంటే జరిగే డ్యామేజ్ కన్నా పొత్తు పెట్టుకుంటే ఎదురవ్వబోయే నష్టం తక్కువే అని లెక్కేశారట.

బీజేపీతో పొత్తుపై చంద్రబాబు లెక్కేమిటంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకోవటమే. కేంద్ర సాయం లేకపోతే జగన్‌ను ఈజీగా ఓడించ‌వ‌చ్చ‌ని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇదే పద్ధ‌తిలో జనసేనతో కూడా పొత్తుకు రెడీ అయిపోయారట. 40 అసెంబ్లీలతో పాటు 7 పార్లమెంటు స్థానాలు కావాలని జనసేన డిమాండ్ చేస్తోందట.

అయితే చంద్రబాబు మాత్రం 30 అసెంబ్లీ+5 పార్లమెంటు నియోజకవర్గాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారని పార్టీ వర్గాల సమాచారం. జనసేన విషయాన్ని పక్కన పెట్టేస్తే బీజేపీకి పట్టుమని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్థులు లేరు. అలాంటి పార్టీకి 12 అసెంబ్లీలు 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వటానికి చంద్రబాబు ప్రతిపాదించటం ఆశ్చర్యంగానే ఉంది. తమ అవసరం చంద్రబాబుకు చాలా ఉందని బీజేపీ అనుకుంటే మరి చంద్రబాబు ప్రతిపాదనకు ఓకే అంటుందా లేకపోతే మరిన్ని డిమాండ్లను చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.


First Published:  1 Sept 2023 10:19 AM IST
Next Story