ఆ సాక్ష్యంపైనే చంద్రబాబు భవిష్యత్తు?
డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు అందిన తర్వాత తొమ్మిది షెల్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వాటిల్లో ఏసీఐ అనే షెల్ కంపెనీకి చంద్రకాంత్ షా ఎండీ. ఈ కంపెనీ నుండే టీడీపీ బ్యాంకు ఖాతాకు రూ.65 కోట్లు బదిలీ అయినట్లు సీఐడీ ఆరోపించింది.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది. ఎందుకంటే ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి అయిన చంద్రకాంత్ షా అప్రూవర్‌గా మారిపోయారు. ఈ స్కామ్‌లో చంద్రకాంత్ షా ఏ 13 నిందితుడు. స్కామ్‌కు సంబంధించి తాను అప్రూవర్‌గా మారిపోతానని గతంలోనే విజయవాడ ఏసీబీ కోర్టును చంద్రకాంత్ రిక్వెస్టు చేసుకున్నారు. తనను అప్రూవర్‌గా అనుమతించాలని కోరుతూ పిటీషన్ కూడా దాఖలు చేశారు.
చంద్రకాంత్ పిటీషన్‌ను కోర్టు అంగీకరించింది. ఆ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. సూత్రధారులు, పాత్రధారులు, జరిగిన కుట్ర యావత్తు బయటపెడతానని కోర్టులో అంగీకరించారు. దాంతో కేసు విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు చంద్రకాంత్ స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేయబోతోంది. స్కిల్ స్కామ్‌లో రూ. 371 కోట్లు దోచుకున్న తొమ్మిది షెల్ కంపెనీల్లో ఏసీఐ అనే కంపెనీ కూడా ఒకటి. సీమెన్స్ కంపెనీ పేరుతో ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకుని తర్వాత డిజైన్ టెక్ అనే కంపెనీని పిక్చర్లోకి సుమంత్ బోస్ అనే వ్యక్తి తీసుకొచ్చినట్లు సీఐడీ ఆరోపిస్తోంది.
ఈ డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు అందిన తర్వాత తొమ్మిది షెల్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వాటిల్లో ఏసీఐ అనే షెల్ కంపెనీకి చంద్రకాంత్ షా ఎండీ. ఈ కంపెనీ నుండే టీడీపీ బ్యాంకు ఖాతాకు రూ.65 కోట్లు బదిలీ అయినట్లు సీఐడీ ఆరోపించింది. ఒకేసారి రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు విచారణకు రమ్మని టీడీపీ ట్రెజరర్, పార్టీ లెక్కలు చూసే ఆడిటర్‌కు సీఐడీ నోటీసులు జారీచేసింది.
అయితే సీఐడీ నోటీసులను చాలెంజ్ చేస్తు కోర్టులో టీడీపీ కేసు వేసింది. ఇప్పుడు చంద్రకాంత్ షా జనవరి 5న కోర్టులో ఇవ్వబోయే స్టేట్‌మెంట్ చాలా కీలకంగా మారబోతోంది. ఏసీఐ కంపెనీకి ఎక్కడి నుండి కోట్ల రూపాయలు అందాయి, అక్కడి నుండి మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళిందనే విషయాలను చంద్రకాంత్ చెప్పారంటే చంద్రబాబు గట్టిగా తగులుకుంటారు. మరి ఆ రోజు కోర్టులో ఏం చెబుతారో చూడాల్సిందే.
♦