బన్నీ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్
అల్లు అర్జున్ వైసీపీని సమర్థించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తన ఫ్రస్టేషన్ ని ఇలా బయటపెట్టారు.
ఎన్నికల ప్రచారం చివరి రోజున వైసీపీకి ఊహించని స్టార్ క్యాంపెయినర్ దొరికారు. అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే కోసం వచ్చినా.. పుష్పరాజ్ రేంజ్ ఏపీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో బన్నీ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నేషనల్ మీడియా కూడా బన్నీ ప్రచారాన్ని హైలైట్ చేస్తోంది. ఈ దశలో చంద్రబాబు అండ్ టీమ్ ఉడుక్కుంటోంది. ఇది కూటమికి చేసిన ద్రోహం అంటూ మండిపడ్డారు బాబు. ఎవరిపై తన ఫ్రస్టేషన్ చూపించాలో తెలియక చివరికి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిపై నిందలు వేశారు.
CBN Reacts On Allu Arjun‘s Campaign For YSRCP Candidate
— M9 NEWS (@M9News_) May 11, 2024
"అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లొచ్చు తప్పు లేదు కానీ జనసేన జండాలు వాడటం తప్పుడు రాజకీయం..."@ncbn @ నంద్యాల#TDPJanasenaBJP pic.twitter.com/a5JTZVXCxT
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం తప్పు కాదు కానీ, జనసేన జెండాలు పట్టుకుని వెళ్లడం మాత్రం తప్పు అని అంటున్నారు చంద్రబాబు. అసలు అల్లు అర్జున్ జనసేన జెండాని ఎప్పుడు పట్టుకున్నారో చంద్రబాబే వివరించాలి. బన్నీ రాకతో వైసీపీలో జోష్ పెరిగింది, అదే సమయంలో జనసేనకు ఊహించని షాక్ తగిలింది. కూటమికి కూడా బన్నీ వ్యవహారం తలనొప్పిగా మారింది. అయితే నేరుగా బన్నీని విమర్శిస్తే ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కూటమికి చుక్కలు చూపిస్తారు. సోషల్ మీడియాలో అయితే తట్టుకోవడం మరీ కష్టం. అందుకే చంద్రబాబు తెలివిగా తన కోపాన్ని వైసీపీ నేతలపై చూపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని, ఆ కుటుంబంలోని హీరోని తీసుకొచ్చి వైసీపీ నేతలు ప్రచారం చేయించుకోవడం చీప్ ట్రిక్స్ అని నిందలు వేశారు బాబు.
ఎన్నికల టైమ్ కి చంద్రబాబు వ్యూహాలన్నీ ఫెయిలవుతున్నాయి. పవన్ కల్యాణ్ ని అడ్డు పెట్టుకుని మెగా ఫ్యామిలీ హీరోలతో కూటమి తరపున ప్రచారం చేయించుకోవాలనుకున్నారు కానీ కుదర్లేదు. కనీసం చిరంజీవితో కూటమికి ఓటు వేయండని మాట్లాడించాలనుకున్నారు కానీ, ఆయన కేవలం పవన్ కోసమే ప్రజలకు సందేశమిచ్చారు. ఆఖరికి రామ్ చరణ్ వచ్చినా కూడా పిఠాపురంకు పరిమితం అయ్యారు. అందరూ పవన్ గెలిస్తే చాలనుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా వారికి పెద్దగా నష్టం లేదు. కానీ అల్లు అర్జున్ ఏకంగా వైసీపీని సమర్థించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తన ఫ్రస్టేషన్ ని ఇలా బయటపెట్టారు.