చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్.. పోలీసులకు హెచ్చరికలు
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గనక గెలవకపోతే రాష్ట్రం నాశనమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక.. పోలీసులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడాలని సూచించారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో కనిపిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆయన పట్టుదలలో తప్పులేదు గానీ.. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. ప్రజలతో మాట్లాడుతున్న తీరు కాస్త విభిన్నంగా ఉంది. తాజాగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గనక గెలవకపోతే రాష్ట్రం నాశనమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక.. పోలీసులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడాలని సూచించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని.. తమకు ఓ రోజు వస్తుందని పోలీసులకు హెచ్చరికలు చేయడం గమనార్హం.
ఇటీవల తాను రాయలసీమలో పర్యటించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఎమ్మిగనూరు ప్రజలు మూడు రాజధానులకు ఒప్పుకోలేదని.. అమరావతే రాజధానిగా ఉండాలని వారు కోరుకుంటున్నారని చంద్రబాబు చెప్పడం గమనార్హం.. నిజానికి సీమ పర్యటనలో పరిస్థితి అందుకు భిన్నం.. మూడు రాజధానులు కావాలా? అమరావతే రాజధానిగా ఉండాలా? అన్న ప్రశ్నకు ప్రజల నుంచి బాబుకు అనుకూలంగా నినాదాలు రాలేదు. అయినప్పటికీ ఆయన ఇలా చెప్పుకుంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యేలమీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారిని టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా బాబు సూచించడం గమనార్హం.
నిజానికి చంద్రబాబు పర్యటన పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం ఆవహించిందని సమాచారం. దీంతో తన యాత్ర విజయవంతమైందని కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబట్టి.. తనను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తంగా చంద్రబాబు ఆశించిన స్థాయిలో ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించకపోవడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.