Telugu Global
Andhra Pradesh

సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు భరోసా

అందులో చంద్రబాబు మార్పులేవీ చేయకుండా ఆ శాఖను అలాగే కొనసాగించారు. అంటే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన కొనసాగించడానికే ఇష్టపడ్డారని స్పష్టమైంది.

సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు భరోసా
X

చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయాలు ఉండవు, వాలంటీర్లను కూడా తీసేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఎన్నికల వేళ వాలంటీర్లకు తాను రూ.10వేలు జీతం ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. సచివాలయ ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ కాస్త ఆందోళనతో ఉన్నారనేమాట వాస్తవం. కానీ ఇప్పుడు వారందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు అలాగే ఉంటాయని పరోక్షంగా హింటిచ్చారు. ఈరోజు మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు.. అసలు విషయం తేల్చేశారు.

డోలా బాలవీరాంజనేయ స్వామికి 'సాంఘిక సంక్షేమం, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ' శాఖను కేటాయించారు. గతంలో ఈ శాఖలో కేవలం సాంఘిక సంక్షేమం, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం మాత్రమే ఉండేవి. జగన్ హయాంలో కొత్తగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థకు కూడా శాఖను ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబు మార్పులేవీ చేయకుండా ఆ శాఖను అలాగే కొనసాగించారు. అంటే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను కూడా చంద్రబాబు కొనసాగించడానికే ఇష్టపడ్డారని స్పష్టమైంది.




శాఖల కేటాయింపు విషయంలో చంద్రబాబు ఈసారి అందర్నీ ఆశ్చర్యపరిచారు. గతంలో జగన్ మహిళలకు హోం శాఖ ఇచ్చినట్టుగానే.. బాబు కూడా వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు. ఇక సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చి సరిపెట్టారు చంద్రబాబు. నారాయణ, లోకేష్ కి పాత శాఖలే కొనసాగించగా.. పయ్యావుల కేశవ్ కి ఆర్థిక శాఖ కేటాయించారు. పవన్ కల్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ తోపాటు.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ అప్పగించారు.

First Published:  14 Jun 2024 3:12 PM IST
Next Story