Telugu Global
Andhra Pradesh

విద్యారంగాన్ని నాశనం చేశారు.. జగన్ పై చంద్రబాబు ధ్వజం

ఇటీవల NIRF ర్యాంకులు విడుదల చేయగా, వివిధ రాష్ట్రాలు సత్తా చూపాయి. ఏపీ విషయంలో ర్యాంకులు బాగా తగ్గాయి. టాప్ 100లో కేవలం రెండు యూనివర్శిటీలు మాత్రమే స్థానం సాధించాయి.

విద్యారంగాన్ని నాశనం చేశారు.. జగన్ పై చంద్రబాబు ధ్వజం
X

ఏపీలో ఉన్నత విద్యారంగాన్ని సీఎం జగన్ నాశనం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శల వర్షం కురిపించారు. ఏపీలో విద్యారంగానికి కేటాయించిన నిధులు వైసీపీ ఖజానాలోకి చేరాయని చెప్పారు. నాలుగేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

యూనివర్శిటీల ప్రతిష్ట దిగజార్చారు..

ఏపీలో యూనివర్శిటీలు వైసీపీ రాజకీయ శక్తులు చేరాయన్నారు చంద్రబాబు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కొన్ని సంస్థలు లాంచ్‌ ప్యాడ్‌గా మారాయ న్నారు. యూనివర్శిటీల విధ్వంసం ఇంకా కొనసాగుతోందని చెప్పారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ ఉన్నత విద్యా రంగాన్ని ఓ క్రమపద్ధతిలో వైసీపీ నాశనం చేసిందని చెప్పారు.


ర్యాంకులేవి..?

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) ర్యాంక్‌ ల్లో ఏపీ దారుణంగా వెనకపడిపోయిందనన్నారు చంద్రబాబు. 2019నుంచి ఈ దురవస్థ కొనసాగుతోందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2019లో 29వ ర్యాంకు రాగా, 2023లో 76వ ర్యాంకుకి పడిపోయిందన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ టాప్ 100లో కూడా లేదన్నారు. టాప్ 100 పరిశోధనా సంస్థలలో ఏపీకి చెందిన ఒక్క సంస్థకి కూడా చోటు దక్కకపోవడం విచారకరం అన్నారు చంద్రబాబు.


ఇటీవల NIRF ర్యాంకులు విడుదల చేయగా, వివిధ రాష్ట్రాలు సత్తా చూపాయి. ఏపీ విషయంలో ర్యాంకులు బాగా తగ్గాయి. టాప్ 100లో కేవలం రెండు యూనివర్శిటీలు మాత్రమే స్థానం సాధించాయి. మిగతా కేటగిరీల్లో కూడా ర్యాంకులు దక్కలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు.

First Published:  7 Jun 2023 5:49 PM IST
Next Story