చంద్రబాబు కేసులు పెడితే.. జగన్ ఎత్తేశారు
కాపు నేతల రిక్వెస్ట్ కారణంగా రెండు నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. అంటే 2016 నుండి 43 మంది కాపు నేతలు మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇప్పుడు కోర్టు కూడా కేసులను కొట్టేసింది.
2016లో తునిలో జరిగిన రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసింది. ఘటనపై సరైన సాక్ష్యాలు లేని కారణంగా 43 మందిపై పెట్టిన కేసులన్నింటినీ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో సరిగా వ్యవహరించని ముగ్గురు రైల్వే అధికారులపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ ముగ్గురు అధికారులపై యాక్షన్ తీసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించింది. ఈ కేసులో ముద్రగడ పద్మనాభం ఏ1, దాటిశెట్టి రాజా ఏ2గా కేసులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే.
కాపులకు రిజర్వేషన్ డిమాండ్‌తో ముద్రగడ 2016 జనవరి 30న తునిలో బహిరంగసభ నిర్వహించారు. బహిరంగ సభ జరిగిన స్థలానికి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. సభ జరుగుతున్న సమయంలోనే రత్నాచల్ రైలు అటు నుండి వెళుతోంది. దాంతో గుర్తుతెలియని కొందరు హఠాత్తుగా రైలుపైన దాడిచేసి నిప్పుపెట్టారు. దాంతో రైలంతా దగ్ధమైపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ రైలు దగ్ధం చేసింది రాయలసీమ గూండాలే అని ప్రకటించారు. అంటే చంద్రబాబు ఉద్దేశంలో వైసీపీ నేతలని. ఆరోపణలు చేసిందేమో రాయలసీమ గుండాలని. అయితే కేసులు పెట్టి అరెస్టులు చేసిందేమో ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలను. రాయలసీమకు చెందిన ఏ ఒకరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే రైలు దగ్దానికి వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధంలేదు కాబట్టే. ఘటనతో తమకు సంబంధం లేదని కాపు నేతలు ఎంత చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళల్లో చాలామందిపై అప్పట్లో కేసులు పెట్టేశారు.
కాపు నేతల రిక్వెస్ట్ కారణంగా రెండు నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. అంటే 2016 నుండి 43 మంది కాపు నేతలు మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇప్పుడు కోర్టు కూడా కేసులను కొట్టేసింది. కోర్టు నిర్ణయంతో ముద్రగడ, దాడిశెట్టి తదితరులకు పెద్ద రిలీఫ్ దొరికొనట్లే అనుకోవాలి. ఈమధ్యనే కోనసీమ అల్లర్ల కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు రెండు కీలకమైన నిర్ణయాలు వైసీపీకి ప్లస్ అవుతుందేమో చూడాలి.