Telugu Global
Andhra Pradesh

‘అదిరిపోయే’ హామీ ఇచ్చిన చంద్రబాబు

చంద్రబాబు ఇచ్చిన హామీలో కొత్తదనమేం ఉందని ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నెలకు 3 వేల రూపాయల పింఛను ఇస్తున్నారు.

‘అదిరిపోయే’ హామీ ఇచ్చిన చంద్రబాబు
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో కొత్తదనమేమీ లేదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.4000కు పెంచి, ఇంటికి చేరేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. వృద్ధులకు, నిరుపేద మహిళలకు ఆ హామీ ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారులకు ఇంటికి పింఛ‌న్ న‌గ‌దు చేర్చే ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.

తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఆయన సోమవారంనాడు ఈ హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో తాను వంద రూపాయలు ఇచ్చి వేయి రూపాయలు వెనక్కి తీసుకునే పద్ధతిని పాటించబోనని, పథకాల అమలులో ఏ విధమైన ఆంక్షలు ఉండబోవని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లబ్ధిదారుల ఇంటికే ప్రతి నెలా 4 వేల రూపాయలు చేరుస్తానని ఆయన చెప్పారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలో కొత్తదనమేం ఉందని ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నెలకు 3 వేల రూపాయల పింఛను ఇస్తున్నారు. వాలంటీర్లు ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. దాన్ని 4 వేల రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అందువల్ల చంద్రబాబు హామీలో ఏ మాత్రం అర్థం లేదు. పైగా, చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు.

First Published:  26 March 2024 12:51 PM IST
Next Story