Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు హైటెక్‌ సిటీ భ్రమ.. జరిగింది రియల్‌ ఎస్టేట్‌ దందానే..

తన కూతురు భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేసిన సమయంలో ఎన్టీఆర్‌ చంద్రబాబుకు 7 ఎకరాల భూమిని ఇచ్చారు. ఆ ప్రాంతంలోనే చంద్రబాబు హైటెక్‌ సిటీ నిర్మాణమంటూ ముందుకు వచ్చి అక్కడి విలువైన ప్రభుత్వ భూములను, ప్రైవేట్‌ భూములను చంద్రబాబు మనుషులు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి.

చంద్రబాబు హైటెక్‌ సిటీ భ్రమ.. జరిగింది రియల్‌ ఎస్టేట్‌ దందానే..
X

నోరు తెరిస్తే చాలు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, హైటెక్‌ సిటీని నిర్మించానని ప్రగల్భాలు పలుకుతుంటారు. వాస్తవాలు తెలియక అదే నిజమని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. తన కోసం, తన మనుషుల కోసం చేసిన పనులను, అద్దె రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు పొందడానికి, రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం హైటెక్‌ సిటీ అనే బాగోతం జరిగిందనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు హైటెక్‌ సిటీ నిర్మాణం కోసం చేసింది సున్నా అనే విషయాన్ని వాస్తవాలను పరిశీలిస్తే అర్థ‌మవుతుంది. హైటెక్‌ సిటీ పేర రియల్‌ ఎస్టేట్‌ దందాను చంద్రబాబు తన మనుషుల కోసం ప్రోత్సహించారు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాలను ఎందుకు అభివృద్ధి చేయలేదనేది ప్రశ్న. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తన కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్మించారు? దాన్ని అమరావతిలోనో, విజయవాడలోనో, విశాఖపట్నంలోనో ఎందుకు నిర్మించుకోలేదు? పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకునే సంస్థగా హెరిటేజ్‌ను తీర్చిదిద్దుకుంటున్నారే తప్ప ఒక్క ఐటి కంపెనీని హైదరాబాద్‌లో పెట్టారా? ఎందుకు పెట్టలేదు? హైటెక్‌ సిటీ విషయంలో ఒక భ్రమను చంద్రబాబు కల్పించారు. ఆ భ్రమనే నిజమని నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు.

తన కూతురు భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేసిన సమయంలో ఎన్టీఆర్‌ చంద్రబాబుకు 7 ఎకరాల భూమిని ఇచ్చారు. ఆ ప్రాంతంలోనే చంద్రబాబు హైటెక్‌ సిటీ నిర్మాణమంటూ ముందుకు వచ్చి అక్కడి విలువైన ప్రభుత్వ భూములను, ప్రైవేట్‌ భూములను చంద్రబాబు మనుషులు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి.

బెంగళూరు కన్నా ముందే..

హైదరాబాద్‌లో 1965లోనే ఈసీఐఎల్‌, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్‌ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం. 1982లో సీఎంసీ ఆర్‌ అండ్‌ డీ వచ్చింది. ఇది సాఫ్ట్‌వేర్‌ సంస్థ. బెంగళూర్‌ కన్నా మూడేళ్ల ముందే అది వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు. 1987లో ఇంటర్‌గ్రాఫ్‌ హైదరాబాద్‌లోని బేగంపేటలో ఏర్పాటయింది. మైత్రీవనంలో 1991లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటైంది. మాదాపూర్‌లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలించారు. దాన్ని ఆసరా చేసుకుని తన 7 ఎకరాల స్థలం ఉన్న ప్రాంతంలోని భూములను చంద్రబాబు మనుషులు తమ చేతుల్లోకి తీసుకునే విధంగా బాబు వెసులుబాటు కల్పించారు. దీంతో ఆయన మనుషులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ముమ్మరం చేశారు. భూదందాలను కొనసాగించారు. ఆ స్థలాల్లో భవనాలు నిర్మించి వాటిని అద్దెలకు ఇవ్వడం ప్రారంభించారు. సంస్థలకు అనుమతుల ఇవ్వడాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

ఐటి సంస్థలు, ఇతర పరిశ్రమలు రావడానికి అనువైన వాతావరణం ఉండడాన్ని, పెద్ద ఎత్తున భూములు అందుబాటులో ఉండడాన్ని చంద్రబాబు, ఆయన మనుషులు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయోజనం పొందుతూ వచ్చారు. హైటెక్‌ సిటీ నిర్మాణం విషయంలో గొప్పలు చెప్పుకునే చంద్రబాబు వ్యవహారాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.

First Published:  2 April 2024 4:00 PM IST
Next Story