Telugu Global
Andhra Pradesh

నందిగామ టికెట్ కొలికపూడికి ఖాయమేనా?

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూకుడు ముందు సౌమ్య నిలవలేరని, కొలికపూడి అయితే ధీటైన అభ్యర్ధి అవుతారని చంద్రబాబు అంచనా వేశారట. అమరావతి భావన ఉన్నవారంతా కొలికపూడికి ఓట్లేసే విషయంలో సానుకూలంగా ఉంటారన్నది చంద్రబాబు ఆలోచనట.

నందిగామ టికెట్ కొలికపూడికి ఖాయమేనా?
X

రాబోయే ఎన్నికల్లో అమరావతి ఆందోళనల్లో బాగా యాక్టివ్‌గా ఉంటున్న కొలికిపూడి శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. అమరావతి ప్రాంతానికి చెందిన కొలికపూడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయిందట. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పక్కనపెట్టి మరీ కొలికపూడికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సౌమ్య మీద ప్రత్యేకంగా ఆరోపణలు కానీ నెగిటివ్ కానీ ఏమీలేకపోయినా కొలికపూడి అభ్యర్ధిత్వంపైన చంద్రబాబు మొగ్గు చూపినట్లు సమాచారం.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూకుడు ముందు సౌమ్య నిలవలేరని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. ఇదే సమయంలో కొలికపూడి అయితే ధీటైన అభ్యర్ధి అవుతారని అంచనా వేశారట. అమరావతి ఆందోళనల్లో ఈయన ఎక్కువగా పాపులర్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అమరావతి భావన ఉన్నవారంతా కొలికపూడికి ఓట్లేసే విషయంలో సానుకూలంగా ఉంటారన్నది చంద్రబాబు ఆలోచనట.

మాజీ ఎమ్మెల్యే సౌమ్యతో పోలిస్తే కొలికపూడి మంచి వక్త, జనాల్లో జోరుగా దూసుకుపోయే వ్యక్తిగా చంద్రబాబు అనుకుంటున్నారు. మీడియా సమావేశాలు పెట్టడం, టీవీ డిబేట్లలో రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేయటం, అమరావతి ఆకాంక్షను బలంగా వినిపించటంలో సౌమ్య కన్నా కొలికపూడి నూరు శాతం బెటర్ అనే అభిప్రాయం చంద్రబాబులో బలంగా నాటుకుపోయిందట. ఇదే విషయాన్ని పార్టీ అధినేత ఇప్పటికే సౌమ్య చెప్పేశారని కూడా పార్టీలో టాక్ నడుస్తోంది.

ఇక కొలికపూడి విషయానికి వస్తే పార్టీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారనేది పెద్ద అనుమానం. ఎందుకంటే సౌమ్య ఎప్పటి నుండో పార్టీలో పనిచేస్తున్నారు. ఈమె తండ్రి తంగిరాల ప్రభాకర్ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభాకర్ చనిపోతే ఉపఎన్నిక ద్వారా సౌమ్య ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుండి ఆమె పార్టీలో బాగానే పనిచేసుకుంటున్నారు. కాకపోతే ఈమె కన్నా కొలికపూడి గట్టి అభ్యర్ధి అని భావించటం వల్లే చంద్రబాబు దృష్టిలో పడ్డారు. పైగా అమరావతికి సంబంధించి టీడీపీ నేతల్లో చాలమంది కన్నా కొలికపూడే చంద్రబాబు వాయిస్‌గా పనిచేస్తుంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

First Published:  29 Dec 2022 11:14 AM IST
Next Story