Telugu Global
Andhra Pradesh

సెంటిమెంట్‌ని ప్రయోగిస్తున్నారా?

గాంధీ జయంతి రోజున అంటే సోమవారం దంపతులు ఇద్దరూ నిరసన దీక్షలు చేయబోతున్నట్లు ప్రకటించారు. జైలులో చంద్రబాబు, రాజమండ్రిలోనే భువనేశ్వరి దీక్షకు కూర్చోబోతున్నారు.

సెంటిమెంట్‌ని ప్రయోగిస్తున్నారా?
X

కేసుల్లో నుండి బయటపడేందుకు చంద్రబాబునాయుడు దంపతులు సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నట్లున్నారు. అవినీతి కేసుల్లో చంద్రబాబు చుట్టూ చట్టం బాగా బిగుసుకుంటోంది. కేసులు ఒకదాని తర్వాత మరొకటి నమోదవుతున్నాయి. న్యాయస్థానాల్లో ఎక్కడా ఊరట దక్కటంలేదు. పైగా కొడుకు లోకేష్ కూడా అవినీతి కేసుల్లో విచారణకు హాజరవుతున్నారు. ఏ నిమిషంలో అయినా అరెస్టు జరగొచ్చు. ఇక మిగిలింది భువనేశ్వరి, బ్రాహ్మణి మాత్రమే. అందుకనే భార్య ద్వారా సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయినట్లున్నారు.

గాంధీ జయంతి రోజున అంటే సోమవారం దంపతులు ఇద్దరూ నిరసన దీక్షలు చేయబోతున్నట్లు ప్రకటించారు. జైలులో చంద్రబాబు, రాజమండ్రిలోనే భువనేశ్వరి దీక్షకు కూర్చోబోతున్నారు. నిజానికి జైలులో ఇలాంటి దీక్షలు నిషిద్ధం. కాకపోత చంద్రబాబురిమాండ్ ఖైదీ అందులోను హై ప్రొఫైల్ వ్యక్తి కాబట్టి దీక్షచేసినా అధికారులు పట్టించుకోకపోవచ్చు. దంపతులు నిరసన దీక్షకు కారణం ఏమిటంటే స్కిల్ స్కామ్‌లో ఇరికించి ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసిందట.

అవినీతికి పాల్పడ్డారనేందుకు సీఐడీ చూపించిన సాక్ష్యాధారాలన్నీ సబబే అని ఏసీబీ కోర్టు పూర్తిగా కన్వీన్స్ అయిన తర్వాతే చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఇదే విషయంలో జోక్యం చేసుకోవటానికి హైకోర్టు నిరాకరించింది. దాఖలుచేసిన క్వాష్ పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు సీఐడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను చూపించింది. అయినా తాను ఏ తప్పుచేయలేదనే చంద్రబాబు అడ్డుగోలుగా వాదిస్తున్నారు. చంద్రబాబు వాదిస్తున్నారంటే అర్థ‌ముంది. భార్య భువనేశ్వరి, లోకేష్, కోడలు బ్రాహ్మణితో పాటు తమ్ముళ్ళు, ఎల్లోమీడియా, మద్దతుదారులంతా ఎందుకింతగా గోల చేస్తున్నట్లు? కళ్ళముందు సాక్ష్యాధారాలు కనబడుతున్నా అవన్నీ తప్పుడు సాక్ష్యాధారాలని ఎందుకు ఎదరు దాడులు చేస్తున్నట్లు?

ఎందుకంటే కోర్టు విచారణలో అవన్నీ ఆధారాలతో సహా నిరూపితమవుతాయనే టెన్షన్ పెరిగిపోతోంది కాబట్టే. కోర్టులో నిరూపితమైతే పదేళ్ళకు తక్కువ కాకుండా శిక్షపడుతుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా నిర్ధారణైతే శిక్షతప్పదు. అప్పుడు పార్టీయే కాదు కుటుంబం కూడా చాలా ఇబ్బందుల్లో పడుతుంది. పరిస్థితి అంతదాకా రాకూడదనే బయటున్న వీళ్ళంతా నానా విధాలుగా రచ్చచేస్తున్నారు. కోర్టులను ప్రభావితం చేయటంలో భాగంగా సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.


First Published:  1 Oct 2023 11:07 AM IST
Next Story