Telugu Global
Andhra Pradesh

మరో కుట్రకు తెర తీసిన చంద్రబాబు.. ఇండిపెండెంట్‌గా వివేకా సతీమణి

సౌభాగ్యమ్మను పోటీకి దించే విషయంపై బీటెక్‌ రవి, షర్మిల భర్త అనిల్‌తోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మరో కుట్రకు తెర తీసిన చంద్రబాబు.. ఇండిపెండెంట్‌గా వివేకా సతీమణి
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో కుట్రకు తెర తీశారు. కడప పార్లమెంటు స్థానంలో దివంగ‌త వైఎస్‌ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దించి రాజకీయ డ్రామా ఆడాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కుట్రపూరితమైన నాటకంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్‌ రవి, బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు సహకరిస్తున్న ఎంపీ సీఎం రమేష్‌ తమ తమ పాత్రలను పోషిస్తున్నారు.

నిజానికి, సునీతను కడప ఎంపీ బరిలో నిలుపాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. అయితే, కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసేందుకు సునీత ఇష్టపడలేదని సమాచారం. దీంతో వివేకా సతీమణి సౌభాగ్యమ్మను పోటీకి దించాలని ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌ తరఫున కాకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే టీడీపీ కూడా మద్దతు ఇవ్వడానికి వీలుంటుందనే చర్చ సాగింది. దానివల్ల కుటుంబ సభ్యుల మద్దతు కూడా సౌభాగ్యమ్మకు అడగడానికి వీలుంటుందని వారు అంచనా వేసుకున్నారు.

తన తండ్రి వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్‌ రవితోనూ సునీత అంటకాగుతున్నారు. సౌభాగ్యమ్మను పోటీకి దించే విషయంపై బీటెక్‌ రవి, షర్మిల భర్త అనిల్‌తోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, బీజేపీ తమకు వ్యతిరేకంగా మారవచ్చునని సునీత భయపడి తన తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. టీడీపీలో చేరితే చంద్రబాబుతో, ఏబీఎన్‌ రాధాకృష్ణతో, బీటెక్‌ రవితో సంబంధాలు బయటపడుతాయని, వివేకా హత్య కేసును ఇన్నాళ్లు తెర వెనక ఉండి నడిపించింది వారేనని తెలిసిపోతుందని భయపడి సునీత సౌభాగ్యమ్మను ఇండిపెండెంట్‌గా నిలిపేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పుతున్నారు.

సౌభాగ్యమ్మను పోటీలో నిలిపితే టీడీపీ బేషరతుగా మద్దతు ఇస్తుందని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇచ్చే విధంగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. దానివల్ల ఎంపీ అవినాష్‌ రెడ్డిపై కావాల్సినంత బురద చల్లడానికి, సౌభాగ్యమ్మకు కుటుంబ సభ్యుల మద్దతు అడగడానికి, ఆమెకు మద్దతు ఇవ్వకుండా అభ్యర్థిని పోటీకి దింపారని జగన్‌ మీద బురద చల్లడానికి అవకాశం దక్కుతుందని భావించి కుట్రకు తెర లేపినట్లు తెలుస్తోంది.

First Published:  3 Feb 2024 7:13 AM GMT
Next Story