Telugu Global
Andhra Pradesh

దళితులపై దాడులు.. చంద్రబాబు కొత్త ఎత్తుగడ ఇదే

ఆ మరకలను కడిగేసుకోడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దళితులపై దాడులంటూ ఇప్పుడు పదే పదే సీఎం జగన్ ని టార్గెట్ చేస్తున్నారు.

దళితులపై దాడులు.. చంద్రబాబు కొత్త ఎత్తుగడ ఇదే
X

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ కొన్నాళ్లుగా చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో దళితులు బతక కూడదా, వారిని అణగదొక్కేస్తారా, ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే దాడులు జగిగాయని అనుకుంటే ప్రత్యేకంగా ఓ ప్రభుత్వ హయాంలో ఓ వర్గాన్నే ఎవరూ టార్గెట్ చేసుకోరు. ఆ వర్గాల్లో వ్యతిరేకత రావాలి అనుకోరు. కానీ చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వం దళితులను టార్గెట్ చేసింది అని పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కుప్పం సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

ఆ మరక కడిగేసేందుకే..?

దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అనే స్టేట్ మెంట్ గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకి, టీడీపీకి బాగా డ్యామేజీ అయింది. ఆయన చెప్పాలనుకున్న అర్థం ఏదయినా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం సరికాదనే విమర్శలు వినపడ్డాయి. బీసీలను తోకలు కత్తిరిస్తామన్నారనే అపవాదు కూడా చంద్రబాబుపై ఉంది. తప్పుడు ప్రచారం అని వీటిని కొట్టిపారేయలేం, వీడియోలతో సహా సాక్ష్యాలున్నాయి. ఈ మరకలను కడిగేసుకోడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దళితులపై దాడులంటూ ఇప్పుడు పదే పదే సీఎం జగన్ ని టార్గెట్ చేస్తున్నారు.

టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు రక్షణ చట్టం అంటూ ఓ ప్రత్యేక హామీ ఇచ్చారు చంద్రబాబు, మేనిఫెస్టో పార్ట్-2లో దళితుల రక్షణ అనేది కూడా ఉంటుందని సమాచారం. అంటే తనపై వచ్చిన విమర్శలను కవర్ చేసుకోవడంలో భాగంగా అంతకంటే పెద్ద విమర్శలను వైసీపీపై చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. చిన్నగీత పక్కన పెద్ద గీత గీయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏపీలో దళితులపై వైసీపీ దాడులు అనే అపవాదు వేయాలనేది చంద్రబాబు ఆలోచన. మరి దీన్ని వైసీపీ ఎంత సమర్థంగా తిప్పికొడుతుందో చూడాలి.

First Published:  16 Jun 2023 6:47 AM IST
Next Story