రాజప్పకే పెద్దాపురం టికెట్.. ఆశావహులకు దెబ్బ
పెద్దాపురం టికెట్ ఆశిస్తూనే చాలా రోజులుగా పనిచేస్తూ వచ్చిన చంద్రమౌళి 10 వేల మందితో పెద్దాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఏ సభలో సత్తా చాటి సీటు సాధించాలనుకున్నాడో అదే సభలో సీటుని మళ్లీ రాజప్పకే ప్రకటించడంతో చంద్రమౌళి తీవ్ర నిరాశకు గురయ్యారు.
పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్‌పై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న తమ్ముళ్ల ఆశలపై చంద్రన్న నీళ్లు చల్లారు. పెద్దాపురం టికెట్‌పై చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. గోదావరి జిల్లాల పర్యటనకి వచ్చిన చంద్రబాబు పెద్దాపురం బహిరంగసభలో అభ్యర్థి ప్రకటన చేసేశారు.
వచ్చే ఎన్నికల్లో చినరాజప్ప పెద్దాపురం నుంచి పోటీ చేస్తారు అని స్పష్టం చేశారు. మూడవసారి ముచ్చటగా చినరాజప్పను గెలిపించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పెద్దాపురం టికెట్ ఆశిస్తున్న మిగతావారికి తప్పక న్యాయం చేస్తాను అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పెద్దాపురంలో చంద్రబాబు రోడ్ షోలో తన బలం ప్రదర్శించాలని ఆశించిన గుణ్ణం చంద్రమౌళి ప్రయత్నాలు నిష్ఫలయమ్యాయి. బహిరంగ సభ కోసం పెద్దాపురంలో భారీ ఏర్పాట్లు చేసిన గుణ్ణం చంద్రమౌళి, తనని పరిగణనలోకి తీసుకుంటారని ఆశించారు.
పెద్దాపురం టికెట్ ఆశిస్తూనే చాలా రోజులుగా పనిచేస్తూ వచ్చిన చంద్రమౌళి 10 వేల మందితో పెద్దాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఏ సభలో సత్తా చాటి సీటు సాధించాలనుకున్నాడో అదే సభలో సీటుని మళ్లీ రాజప్పకే ప్రకటించడంతో చంద్రమౌళి తీవ్ర నిరాశకు గురయ్యారు.
టిడిపి సీటుపై ఆశతో వైసీపీ నుంచి టిడిపిలో చేరిన పెద్దాపురానికి చెందిన నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశలు అడియాసలయ్యాయి.