Telugu Global
Andhra Pradesh

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎల్లో మీడియా కూడా విష ప్రచారాన్ని కంటిన్యూ చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ లను అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతోంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం ఇంకా తగ్గలేదు. ఆమధ్య వైసీపీ, ఈసీకి ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేతలు కాస్త నోరు అదుపులో పెట్టుకున్నారు కానీ, చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోవడంలేదు. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ఆయన విచ్చలవిడిగా అద్ధాలు చెబుతున్నారు, అసత్య ప్రచారంతో ప్రజల్లో లేనిపోని భయాందోళనలు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విశాఖ పర్యటనలో చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తావన తెచ్చారు. మెడ మీద కత్తి పెట్టి వైసీపీ నేతలు ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారు చంద్రబాబు.

ఎల్లో మీడియా విషప్రచారం..

మరోవైపు ఎల్లో మీడియా కూడా ఈ విష ప్రచారాన్ని కంటిన్యూ చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ లను అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతోంది. సర్వస్వం కోల్పోయే దస్తావేజు అంటూ సెటైరిక్ గా ఉన్న ఓ దస్తావేజుని ఈనాడు ప్రచురించింది. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసినవారంతా తమ యావదాస్తిని జగన్ కి దారాదత్తం చేస్తున్నట్టేనని, ఇకపై వారి ఆస్తితో కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది. ఎన్నికల టైమ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారాన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

మేనిఫెస్టో ఫెయిల్..

సీఎం జగన్ నవరత్నాలను మించి పెద్దగా ఈ మేనిఫెస్టోలో హామీలివ్వలేదు. అటు టీడీపీ మాత్రం సూపర్ సిక్స్ తోపాటు.. అలవికాని హామీలతో మేనిఫెస్టోని ఆకర్షణీయంగా మార్చింది. అయితే బాబు మాటల్ని నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. పైగా టీడీపీ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని, అది పూర్తి బూటకం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంతో జనం ఆలోచనలో పడ్డారు. అంటే చంద్రబాబుకి ఇక్కడ మేనిఫెస్టో అనేది ఏమాత్రం ఉపయోగంగా మారే అవకాశం లేదు. దీంతో వైసీపీపై బురదజల్లుతూ ఓట్లు అడిగేందుకు టీడీపీ సిద్ధమైంది. ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ ఈ తప్పుడు ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది.

First Published:  10 May 2024 8:37 AM IST
Next Story