వైఎస్ విజయమ్మ ట్రస్ట్ ను రద్దు చేసిన కేంద్రం !
వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన "విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్"అనుమతులను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసింది.ఆమె ఈ ట్రస్టు ద్వారా కడప, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పేదలకు విద్య, పుస్తకాలు, వస్త్రాలను అందిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన భార్య వైఎస్ విజయమ్మ తన పేరిట ఓ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నారు. వారి స్వంత ప్రాంతం కడప, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పేదలకు విద్య, పుస్తకాలు, వస్త్రాలను అందిస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న ఈ "విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్"అనుమతులను కేంద్రం రద్దు చేసింది. విజయమ్మ నిర్వహిస్తున్న ట్రస్ట్ కు ఎఫ్ ఆర్ సీఎస్ చట్టం 2010 కింద నిధులు కూడా సమీకరిస్తూ సేవలు కొనసాగిస్తున్నారు.
విదేశీ నిధులు పొందుతున్న సంస్థలు ప్రతీ యేటా మార్చి-ఏప్రిల్ నెల మధ్యలో కేంద్ర ఆర్థిక, హోం శాఖలకు నివేదికలు పంపాల్సి ఉంటుంది. ఏయే దేశాల నుంచి, ఏయే సంస్థల నుంచి,విరా|ళాలు సేకరిస్తున్నారు ఎంత సొమ్ము వస్తున్నది , ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు తదితర వివరాలు అందించాల్సి ఉంటుంది.
ఈ వివరాలను మూడేళ్ళుగా తెలియపర్చని సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ట్రస్ట్ తో పాటు మరోరెండు సంస్థల లైసెన్సులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయమ్మ ట్రస్ట్ ను కూడా రద్దు చేసిందని అంటున్నారు.