కొత్త కోణం.. వారం రోజులుగా హార్బర్ లో పనిచేయని సీసీ కెమెరాలు
సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని పోలీస్ కమిషనర్ ని కోరినట్టు తెలిపారు వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. బాధితులను పరామర్శించిన ఆయన వారిని ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఎవరు అనే విషయంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన అనుమానితుడిగా ఉన్న యూట్యూబర్ నాని ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. డీసీపీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. యూట్యూబర్ సెల్ ఫోన్ డేటా, హార్బర్ లో అతని కదలికలపై విచారణ కొనసాగుతోంది. వారం రోజులగా హార్బర్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు.
విశాఖ హార్బర్ అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులు వేటకు వెళ్లేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను వెంటనే కల్పిస్తాం.
— YSR Congress Party (@YSRCParty) November 21, 2023
- రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి#YSJaganCares#AndhraPradesh pic.twitter.com/pRTugkVNGb
సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని పోలీస్ కమిషనర్ ని కోరినట్టు తెలిపారు వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. బాధితులను పరామర్శించిన ఆయన వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. మునిగిపోయిన బోట్లను తొలగించాలని పోర్టు అధికారులను కోరామన్నారు. మత్స్యకారులు కోలుకుని కొత్త పడవలు సమకూర్చుకుని వేటకు వెళ్లేందుకు అవసరమైన సాయం చేస్తామన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఘటనలో కుట్రకోణం ఉంటే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి.
ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో హార్బర్ లో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. పోర్టు, స్టీల్ ప్లాంట్ పోలీసులు వేగంగా స్పందిచారని, లేదంటే ఆయిల్ ట్యాంకర్ ల నుంచి ముప్పు ఉండేదని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందించారని చెప్పారు. బోటు ఖరీదు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నప్పటికీ అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. గతంలో మాదిరిగా పరిహారం ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామని భరోసా ఇచ్చారు వైవీ.
♦